ఆసాంజే నిర్బంధం నిరంకుశం -ఐరాస

వికీలీక్స్ వ్యవస్ధాపక ఎడిటర్ జులియన్ ఆసాంజే నిర్బంధం చట్ట విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఆసాంజే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఐరాస కమిటీ ఈ మేరకు ఒక నిర్ధారణ వచ్చిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే కమిటీ నిర్ణయాన్ని అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తారని పత్రిక తెలిపింది. స్వీడన్ లో దాఖలయిన ఒక తప్పుడు కేసు దరిమిలా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో గత నాలుగు సంవత్సరాలుగా లండన్ పోలీసు నిర్బంధంలో ఆసాంజే గడుపుతున్నాడు. ఆసాంజేను…

అమెరికా పౌరహక్కుల ‘రారాజు’ జనించి 86 యేళ్ళు! -ఫోటోలు

జాత్యహంకారానికి గురవుతున్న నల్లజాతి ప్రజలతో పాటు పెట్టుబడిదారీ పదఘట్టనల క్రింద నలుగుతున్న తెల్లజాతి కార్మికవర్గ హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, గౌరవప్రదమైన జీవనం కోసం ఉద్యమించిన పౌరహక్కుల ఉద్యమ తరంగం మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్! ఆయన జన్మించి జనవరి 15తో 86 సం.లు నిండాయి. వాషింగ్టన్ డి.సి లింకన్ హాలు ముందు మెట్లపై నిలబడి ఆయన చేసినచరిత్రాత్మక ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగం ఇప్పటికీ అత్యంత ఉత్తేజకరమైన ప్రసంగాలలో ఉన్నతమైనదిగా కొనియాబడుతోంది. ఆధిపత్య వర్గాల…

వీసా ఇస్తామని అనుకోవద్దు, అమెరికా వివరణ

అమెరికా రాయబారి నరేంద్ర మోడిని కలవడానికి అపాయింట్ మెంట్ కోరినంత మాత్రాన తమ వీసా విధానంలో మార్పు ఉంటుందని భావించనవసరం లేదని అమెరికా విదేశాంగ శాఖ వివరణలాంటి సవరణ ప్రకటించింది. అమెరికా వీసా విధానంలో గానీ, ప్రపంచవ్యాపితంగా మానవహక్కులకు మద్దతుగా నిలవడంలో గానీ అమెరికా ఎలాంటి మార్పు చేసుకోలేదని గొప్పలు పోయింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకి విలేఖరులకు వివరణ ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలుసుకోవడానికి అమెరికా రాయబారి…

మానవహక్కుల శిక్షణకు నిధులిస్తా తీసుకో, అమెరికాతో ఈక్వడార్

సార్వభౌమాధికార దేశం అంటే ఇదిగో ఇలా ఉండాలి! ఎంత చిన్న దేశం అయితేనేం, తన సార్వభౌమత్వానికి ప్రతీకాత్మకంగా ఐనా భంగం కలిగించే పెత్తందారీ హెచ్చరికల మొఖం మీద చాచికొట్టినట్లు సమాధానం చెప్పగలిగిన సత్తా ఉన్నపుడు! ఈక్వడార్ ఇప్పుడు అదే చేస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇస్తే ఈక్వడార్ కు లబ్ది చేకూర్చే రెండు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని అమెరికా హెచ్చరించిన గంటలలోపే ఈక్వడార్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. రష్యా టుడే ప్రకారం,…

ఐరాస మానవ హక్కుల ఓటుకు భారత్ పై శ్రీలంక ప్రతీకారం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (United Nations Human Rights Council – UNHRC) లో గురువారం జరిగిన ఓటింగులో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత దేశం వేసిన ఓటు శ్రీలంకలో ‘ఇండియన్ ఆయిల్ కంపెనీ‘ (ఐఒసి) వాణిజ్య ప్రయోజనాలకు చేటు తెచ్చిపెట్టింది. ట్రింకోమలిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న 99 ట్యాంకుల ఆయిల్ గిడ్డంగి లోని ట్యాంకులను పాక్షికంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందని పిటిఐ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత ప్రభుత్వ…

ఈ దళిత మహిళల ఆత్మగౌరవం మహోన్నతం

భారతదేశ ప్రతిష్ట, ఆత్మగౌరవాలు దేశంలోని కోట్లాది శ్రమజీవుల్లో ఉన్నాయి తప్ప డాలర్ల కోసం దేశ సరిహద్దులు దాటడానికి అవలీలగా సిద్ధపడేవారిలోనో, తెల్లరాజ్యాల పౌరసత్వం కోసం అర్రులుచాచే బుద్ధి జీవుల్లోనో లేదని దళిత మహిళలు అక్కు, లీల లు చాటి చెబుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల పౌరసత్వం సంపాదిస్తేనే ప్రపంచాన్ని జయించినంత సంబరపడే కొద్ది బుద్ధుల అల్పజీవులు, దశాబ్దాల బెత్తెడు వేతన జీవనంలోనూ నిలువెత్తు ఆత్మ గౌరవాన్నీ త్యజించలేని అక్కు, లీలలను చూసి నిష్కళంక హృదయాలతో సిగ్గుపడవచ్చు. లేదంటే…

లెట్రిన్ లు కడిగే ఈ దళిత మహిళల నెలజీతం 15/-

అక్కు, లీల అనే ఇద్దరు దళిత మహిళలు 42 సంవత్సరాలుగా లెట్రిన్ లు కడుగుతున్నారు. వీరి నెల వేతనం అప్పుడూ, ఇప్పుడూ 15 రూపాయలే. కోర్టుకి వెళ్ళినందుకు ఆ 15 రూపాయలు కూడా చెల్లించడం మానేశారు. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రాష్ట్ర హై కోర్టు, చివరికి సుప్రీం కోర్టు కూడా మహిళలకు అనుకూలంగా తీర్పులిచ్చి వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించాయి. కోర్టు ధిక్కారం నోటీసులు అందుకున్నాక కూడా, తీర్పులను అమలు చేయకపోగా, రిటైర్ మెంట్ వయసుకి…

అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -2

గత పోస్టు తరవాయి భాగం… 3. ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు వాస్తవ నిరుద్యోగం అధికారిక అంచనాల కంటె చాలా అధికంగా 20 శాతం పైనే ఉంది. (ఇది అధికారిక అంచనాకి రెట్టింపుకంటె ఎక్కువ). ఆహారం, ఇంధనం, వైద్య ఖర్చులు, విద్యా ఖర్చులు తదితర ధరలు అధికారిక లెక్కల్లో చాలా తక్కువచేసి చూపడం వలన వాస్తవ ద్రవ్యోల్భణం 10 శాతం పైనే ఉంటుంది. (ఇది కూడా అధికారిక అంచనాకి రెట్టింపుకంటె ఎక్కువ). జీవనానికి పడుతున్న వాస్తవ ఖర్చు…

అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -1

ప్రతి సంవత్సరం అమెరికా ప్రపంచ దేశాల మానవ హక్కుల ఆచరణ తీరుపై ఒక నివేదిక వెలువరిస్తుంది. 2010 సంవత్సరానికి కూడా అలావే మానవ హక్కుల నివేదికని వెలువరించింది. అందులో 190కి పైగా దేశాలపై తన తీర్పు రాసుకుంది. 145 పేజీల ఈ నివేదికలో అమెరికా మానవహక్కుల రికార్డు మాత్రం ఉండదు. ప్రపంచంలోనే మానవ హక్కులను ఉల్లంఘించడంలో సంఖ్య రీత్యా, పద్దతుల రీత్యా కూడా మొదటి స్ధానంలో ఉండే అమెరికా తన కింద నలుపు కాదు కదా, ఒళ్ళంతా…