బ్రాహ్మణుల ఎంగిలాకులపై దొర్లే మాదే స్నానపై సుప్రీం స్టే

మాదే స్నాన! 500 యేళ్ళ నుండి కొనసాగుతున్న ఆచారం అని చెపుతూ అటు అగ్ర కులస్ధులు, ఇటు నిమ్న కులస్ధులు ఆచరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక ఆచారం. వినడానికి, చదవడానికి జుగుప్స కలిగించే ఈ ఆచారాన్ని రద్దు చేయాలని బి.సి. సంఘాలు అనేక యేళ్లుగా పోరాడుతున్నా, ప్రభుత్వాల-కోర్టుల పరోక్ష మద్దతుతో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. తన చెంతకు వచ్చిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ‘ఆచారాన్ని కొనసాగించవచ్చన్న’ హై కోర్టు ఆదేశాలపై స్టే…