మీ మౌనం ఇక ఎంతమాత్రం పరిష్కారం కాదు -కవిత
(విశాఖ జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం (POW) వారు 1990లో ఒక పుస్తకం ప్రచురించారు. కుటుంబ హింసకు, వరకట్న హత్యకు, లాకప్ హత్యకు, అత్యాచారాలకు గురయిన వివిధ మహిళల కోసం వారు చేసిన కృషిని విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకంలో వివరించారు. దాదాపు అన్ని రంగాలలోని -కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రొఫెసర్ల కూతుళ్ళు, బ్యాంకర్ల భార్యలు, ఉద్యోగుల కోడళ్ళు…ఇలా వివిధ తరగతులకు చెందిన మహిళలు పురుషాధిక్య వ్యవస్ధ పాటించే వివక్షను, అణచివేతను, హింసను, చివరికి హత్యలను ఎదుర్కొంటున్నారని విశాఖ…