హెలిపాడ్ కు 10 వేల లీటర్ల నీళ్ళు! -కార్టూన్

“తగినంత నీటిని జల్లే వ్యూహం పని చేసింది, వి‌ఐ‌పి చాపర్ వల్ల అస్సలు దుమ్మే రేగలేదు!” – ఓ పక్క నీతులు వల్లించడం, మరో పక్క అవే నీతుల్ని అడ్డంగా, తడబాటు లేకుండా ఉల్లంఘించడం! దళితుల అభ్యున్నతే లక్ష్యం అంటారు. ఆ దళితులపైనే పార్లమెంటులో విష ప్రసంగాలు గుప్పిస్తారు. దళితుల ఆహార అలవాట్లను నేరంగా మార్చుతూ చట్టాలు చేస్తారు. రోహిత్ లను జాతీయ వ్యతిరేకులుగా ముద్ర వేస్తారు. ముస్లిం మతం అహింసకు నిలయం అని ప్రసంగం చేస్తారు.…

మహారాష్ట్ర: శివసేనకు ప్రతిపక్ష పాత్రేనా?

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శివసేన తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలన్న బి.జె.పి లక్ష్యం, ఆరు నూరైనా మహారాష్ట్ర వరకు తనదే పై చేయి కావాలని భావిస్తున్న శివసేన… వెరసి రాష్ట్ర ప్రజల ముందు ఓ వింత నాటకం ఆవిష్కృతం అవుతోంది. బి.జె.పికి బేషరతు మద్దతు ప్రకటించడం ద్వారా ఎన్.సి.పి, శివసేన బేరసారాల శక్తిని దారుణంగా దిగ్గోయడంతో బి.జె.పికి అదనపు శక్తి వచ్చినట్లయింది. కానీ బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్.సి.పి అంత తేలిగ్గా సరెండర్ కాదని,…

మహా రాష్ట్ర: బి.జె.పి, శివసేనల పీతల తట్ట

పీతల్ని ఒక పాత్రలో వేసి పెడితే అవి తప్పించుకోకుండా ఉండడానికి ప్రత్యేకంగా మూత పెట్టనవసరం లేదట. ఒకటి ఎలాగో సందు చూసుకుని అంచు దాటి పోయేలోపు మరో పీత ఆ పైకి వెళ్ళిన పీత ఆధారంగా తానూ పైకి వెళ్ళే ప్రయత్నంలో మొదటి పీతను కిందకు లాగేస్తుంది. మొత్తం మీద ఏ పీతా తప్పించుకోకుండా తమకు తామే కిందకు లాగేస్తూ యజమానికి సహాయం చేస్తాయి. మహారాష్ట్రలో బి.జె.పి, శివ సేన పార్టీల తగవులాట కూడా పీతలాటను తలపిస్తోంది.…