అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు. “కాంగ్రెస్,…