బిజేపి నేతల వైభోగాన్ని ఆపలేని వెడ్డింగ్ బిల్లు!
ఓ పక్క ప్రధాన మంత్రి వృధా ఖర్చు చేయొద్దని బోధిస్తారు. డీమానిటైజేషన్ ద్వారా నల్ల డబ్బు నిరోధించానని చెప్పుకుంటారు. అట్టహాసంగా జరిగే పెళ్లిళ్ల ఖర్చులపై పరిమితి విధించేందుకు కాంగ్రెస్ ఎంపి ప్రతిపాదించిన బిల్లును బిజేపి ప్రభుత్వ కేబినెట్ తానే స్వయంగా ఆమోదించి సభలో పెడుతుంది. మరో పక్క ఆ బిజేపి ఎంపిలే నల్ల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అంగరంగ వైభోగంగా పెళ్లిళ్లు కానిచ్చేస్తుంటారు. ‘కోటలు దాటే మాటలు, గడప దాటని చేతలు’ సామెతకు అచ్చమైన ప్రతినిధులు…