ఇ-బ్రిక్స్ మా కల -ఈజిప్టు అధ్యక్షుడు

ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి…

ఈజిప్టులో అధికార కుమ్ములాటలు తీవ్రం, అధ్యక్షుడి డిక్రీ రద్దు చేసిన కోర్టు

ఈజిప్టులో పాత, కొత్త అధికార వర్గాల మధ్య ఘర్షణలు మరో అంకానికి చేరాయి. కోర్టు రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరిస్తూ అధ్యక్షుడు ముర్సి జారీ చేసిన డిక్రీ ని కోర్టు కొట్టివేసిందని బి.బి.సి తెలిపింది. ముప్ఫై యేళ్ళుగా ఈజిప్టును తన కబంధ హస్తాల్లో బంధించిన మిలట్రీ నియంతృత్వ పాలకుల ప్రయోజనాలకు ప్రతినిధిగా భావిస్తున్న ‘సుప్రీం కాన్సిటిట్యూషనల్ కోర్టు’ పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజా తిరుగుబాటు ఫలితంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గిన పార్లమెంటుకు మిలట్రీ పాలకుల…

ఈజిప్టు ఎన్నికల్లో ‘ముస్లిం బ్రదర్ హుడ్’ పై చేయి, ‘రనాఫ్’ తధ్యం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ అభ్యర్ధి మహమ్మద్ ముర్సి దాదాపు పై చేయి సాధించాడు. 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని ప్రెస్ టి.వి తెలిపింది. 26 శాతం ఓట్లతో ముర్సి ముందంజలో ఉండగా, మాజీ నియంత హోస్నీ ముబారక్ ప్రభుత్వంలో చివరి ప్రధానిగా పని చేసిన అహ్మద్ షఫిక్ 24 శాతం ఓట్లతో రెండవ స్ధానంలో ఉన్నాడని బి.బి.సి తెలిపింది.  వీరి ఓట్ల శాతం వరుసగా 25 శాతం, 23 శాతం…