బద్ధ శత్రు దేశాలకు ఇరాన్ స్నేహ హస్తం

ఇరాన్ తన బద్ధ శత్రు దేశాలకు కూడా స్నేహ హస్తం చాస్తోంది. P5+1 దేశాలతో తాత్కాలిక ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ విదేశీ మంత్రి మహమ్మద్ జవద్ జరీఫ్ మధ్య ప్రాచ్యంలోని ఇతర ప్రత్యర్ధి దేశాలతో సంబంధాలను బాగు చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా సున్నీ ముస్లిం మత దేశాలలో ఆయన పర్యటిస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో మతపరంగానూ, చమురు వాణిజ్య ప్రయోజనాలపరంగానూ తమకు ప్రధాన ప్రత్యర్ధి సౌదీ అరేబియా కు సైతం జారీఫ్ ప్రయాణం చేయడం…