ఒకే వేదికపై బి.జె.పి, లెఫ్ట్ పార్టీలు

బి.జె.పి, లెఫ్ట్ పార్టీల నాయకులు ఢిల్లీలో కలకలం సృష్టించారు. చిల్లర వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినందుకు నిరసనగా ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ సందర్భంగా ఉప్పు, నిప్పుగా ఉండవలసినవారు ఒకే వేదికపైకి చేరారు. వ్యాపారులు నిర్వహించిన నిరసన సభలో బి.జె.పి, లెఫ్ట్ పార్టీల అగ్రనాయకులు ఆసీనులై పత్రికల, విశ్లేషకుల ఊహాగానాలకు పని పెట్టారు. ఇది దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చే పరిణామం కాకపోయినప్పటికీ వామపక్ష పార్టీల ప్రకటిత విధానాలు తెలిసినవారు భృకుటి ముడివేసే పరిణామమే.…

చిల్లర వర్తకంలో 51% విదేశీ పెట్టుబడులకు కేబినెట్ అనుమతి

అమెరికన్ కంపెనీలకు ఇచ్చిన హామీని భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది. దేశంలో ఇరవై కోట్లమందికి ఉపాధి నిస్తున్న చిల్లర వర్తకాన్ని తీసుకెళ్లి వాల్ మార్ట్ చేతుల్లో పెట్టింది. చిల్లర కొట్లు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకున్న ఐదు కోట్ల కుటుంబాలను వీధి పాలు చేస్తూ రిటైల్ వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుందని ‘ది హిందూ’ తెలిపింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా పత్రికలకు చెప్పలేదు. పేరు చెప్పవద్దని కోరుతూ ఒక…

రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల నిర్ణయం సస్పెన్షన్ -కార్టూన్

విపక్షాలతో పాటు, స్వపక్షాలు కూడా రిటైల్ రంగంలో ఎఫ్.డీ.ఐ లు ఆహ్వానించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో మన్మోహన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ఏకాభిప్రాయం సాధించి తిరిగి ప్రవేశపెడతానని పరోక్షంగా తెలిపింది. ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించేది లేదని చెబుతున్నాయి. బి.జె.పి ప్రభుత్వంలో జస్వంత్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పని చేసిన కాలంలో రిటైల్ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడుల్ని అంగీకరించాలని వాదించాడు. ఇప్పుడా పార్టీ యు-టర్న్ తీసుకున్నానని చెబుతోంది. చూద్దాం, ఎంతకాలమో! –…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయం సస్పెన్షన్ తాత్కాలికమే

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేయడం తాత్కాలిక చర్య మాత్రమేనని కేంద్ర ప్రభుత్వంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “ఇవి కేవలం భారతీయ రాజకీయాలు మాత్రమే” అని ఆ అధికారి అన్నట్లుగా రాయిటర్స్ తెలిపింది. “నమ్మదగని భారత ప్రభుత్వం (ఫికిల్ ఇండియా గవర్నమెంట్) విదేశీ సూపర్ మార్కెట్ల నిర్ణయాన్ని పక్కనబెట్టింది” అన్న హెడ్డింగ్ తో  రాయిటర్స్ వార్తా సంస్ధ ఓ…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని కేంద్రం సస్పెండ్ చేసింది -మమత

రిటైల్ రంగంలో ‘విదేశీ పెట్టుబడుల’ నిర్ణయం శనివారం అనూహ్యంగా మలుపు తిరిగింది. సూపర్ మార్కెట్లలో 51 శాతం మేరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని శనివారం బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు ఆ విషయం తెలిపినట్లుగా మమతా బెనర్జీ విలేఖరులకు తెలిపింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ ఇప్పటివరకూ ఎటువంటి చర్చా జరగలేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి రోజూ…

విదేశీ సూపర్ మార్కెట్లపై ప్రభుత్వం దేశాన్ని ఫూల్ చేస్తోంది. -అద్వాని

విదేశీ సూపర్ మార్కెట్ల వల్ల కలగనున్న లాభాలపై ప్రభుత్వం దేశాన్ని ఫూల్ చేస్తోందని ప్రతిపక్ష బి.జె.పి అగ్ర నాయకుదు ఎల్.కె.అద్వానీ శనివారం ఆరోపించాడు. “వాల్-మార్ట్ పశ్చిమ దేశాలకు మంచిది కావచ్చు. కాని వాల్-మార్ట్ మనకు సేవ చేసే సంస్ధ కాదు” అని అద్వాని పేర్కొన్నాడు. “మనం వాల్-మార్ట్ పట్ల అసూయ చెందకూడదు” అని న్యూఢిల్లీలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తూ అద్వానీ చెప్పాడు. తద్వారా పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను అతిగా అనుకరించడంపైన హెచ్చరించాడు. నిజానికి బి.జె.పి…

ఎన్.డి.ఎ వంద శాతం ఎఫ్.డి.ఐ రిటైల్ రంగంలో రావాలని ప్రతిపాదించింది కదా -మంత్రి

ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు రిటైల్ రంగంలోకి వంద శాతం పెట్టుబడుల రావాలని ప్రతిపాదించిందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశాడు. యు.పి.ఎ ప్రభుత్వం అప్పటినుండి అనేక చర్చోప చర్చలు సాగించి కేవలం 51 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రిటైల్ రంగంలోకి అనుమతించాలని ఖుర్షీద్ తెలిపాడు. “రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయం తీసుకునే ముందు మేము అనేక రకాలుగా ఆలోచించాం. ఎన్.డి.ఎ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటినుండీ అనేక విధాలుగా ఈ విషయమై…

‘వాల్ మార్ట్’ స్టోర్ ని తగలబెడతా -ఉమా భారతి

వాల్ మార్ట్ లాంటి బహుళజాతి రిటైల్ కంపెనీలు భారత దేశంలో షాపులు పెట్టినట్లయితే వాటిని స్వయంగా తగలబెడతానని బి.జె.పి నాయకురాలు ఉమా భారతి ప్రకటించింది. భారత దేశంలో ఎక్కడ షాపు పెట్టిన తక్కడికి తన కార్యకర్తలతో వెళ్ళి తగలబెడతానని ఆమె ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత దేశ చిల్లర అమ్మకాల (రిటైల్) రంగంలోకి అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగిల్ బ్రాండ్ రంగం లో వందశాతం, మల్టీ బ్రాండ్ రంగంలో 51 శాతం…