పొరబాటున కూల్చారు -అమెరికా

అమెరికా ఇప్పుడు స్వరం మార్చింది. రష్యా ఇంటలిజెన్స్ అధికారుల ప్రత్యక్ష సహకారంతో తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే బక్ మిసైల్ తో మలేషియా విమానాన్ని కూల్చారని, అందుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ ఆరోపణల నుండి వెనక్కి తగ్గింది. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పొరబాటున కూల్చి ఉండవచ్చని చెబుతోంది. అయితే అందుకు కూడా తమ వద్ద సాక్ష్యాలు లేవని మెల్లగా చెబుతోంది. ఈ వ్యవహారం చూస్తే మహా భారతంలోని…

బక్ మిసైళ్ళు మిలిటెంట్ల దగ్గర లేవు -ఉక్రెయిన్ అధికారి

మలేషియా విమానాన్ని కూల్చివేసింది తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే అని పశ్చిమ పత్రికలు, పశ్చిమ రాజ్యాధినేతలు తెగ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం ఇదే పల్లవి అందుకుని మిలిటెంట్లను పోరాట విరమణ చేసేలా సహకరించడం లేదని రష్యాకి కూడా పాపం అంటగట్టే ప్రయత్నం చేశారు. అయితే మిలిటెంట్ల దగ్గర అసలు బక్ మిసైళ్లే లేవని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పడంతో ఈ ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం అయిపోయింది.…

కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్, తిన్నది 300 పూటలు

ఓ చైనీయుడి తెలివితేటలివి. ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్ కొని, అదే టికెట్ పైన 300 రోజులు ఫస్ట్ క్లాస్ ఉచిత భోజనం ఆరగించాడా పెద్ద మనిషి. కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ టికెటే. కానీ ఆయన తిన్నది మాత్రం 300 భోజనాలు! అదెలాగో తెలిస్తే ఈర్ష్య కలగడం ఖాయం! ఎకానమీ క్లాస్ టికెట్ కొన్నవారికి ఉచిత భోజనం పెడతారో లేదో తెలియదు గానీ ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నవారికి మాత్రం ఒక మృష్టాన్నభోజనాన్ని…