పేలలేదు, కూలలేదు -ఐరాస

మలేషియా విమానం ‘ఫ్లైట్ MH370’ గాలిలో పేలిపోయిందనడానికి గానీ, సముద్రంలో కూలిపోయిందనడానికి గానీ సాక్ష్యాలు లేవని ఐరాసకు చెందిన సంస్ధ CTBTO ప్రకటించింది. ‘సమగ్ర (అణు) పరీక్షల నిషేధ ఒప్పంద సంస్ధ’ (Comprehensive Test Ban Treaty Organisation) ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశీలనా కేంద్రాలేవీ విమానం కూలిపోయిన జాడలు గానీ, పేలిపోయిన జాడలను గాని రికార్డు చేయలేదని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ ప్రతినిధి స్టెఫాన్ డుజరిక్ ప్రకటించారు. విమానం సముద్రంలో కూలినా, నేలపై…

మలేషియా విమానం: ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చిందా? -ఫొటోలు

అదృశ్యం అయిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం Flight MH370 ఉద్దేశ్యపూర్వకంగానే దారి మార్చుకుని అండమాన్ వైపుకి ప్రయాణించిందా అన్న అంశాన్ని మలేషియా అధికారులు పరిశోధిస్తున్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు హిందూ మహా సముద్రంలో కూడా వెతుకులాట ప్రారంభం కావచ్చని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి జె కార్ని ప్రకటించడంతో మలేషియా అధికారుల అనుమానాలకు ఇతర దేశాలు కూడా విశ్వసిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. విమానాన్ని ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చి అండమాన్ సముద్రం మీదికి,…

విమాన ప్రమాదం: ఇండియా సాయం కోరిన మలేషియా

ప్రమాదానికి గురయిందని భావిస్తున్న Flight MH370 మలేషియా విమానం వెతుకులాటలో సహాయం చేయాలని మలేషియా ఇండియాను కోరింది. కౌలాలంపూర్ నుండి ఈశాన్య దిశగా ప్రయాణమై బీజింగ్ చేరాల్సిన విమానం మధ్యలోనే వెనక్కి మళ్ళీ పశ్చిమ దిశగా మలక్కా ద్వీపాల వరకు వచ్చినట్లు ఆ దేశ మిలట్రీ అధికారులు చెప్పడంతో ఇండియా సాయం అవసరం అయింది. మలక్కా ద్వీపాలకు సమీపంలోనే అండమాన్ నికోబార్ ద్వీపాలు ఉన్నాయి. అండమాన్, నికోబార్ ద్వీపాల్లో భారత నావికా బలగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.…

మలేషియా ప్రమాదం: అది విమాన ఇంధనం కాదు

మలేషియా విమాన ప్రమాదం మరింత మిస్టరీలోకి జారిపోయింది. దక్షిణ చైనా సముద్రంలో కనపడిన రెండు భారీ చమురు తెట్లు విమాన ఇంధనంకు సంబంధించినవి కావని పరీక్షల్లో తేలింది. వియత్నాం నావికా బలగాలకు కనపడ్డాయని చెబుతున్న విమాన శిధిలాలు కూడా వాస్తవానికి ఎక్కడా కనపడలేదని తెలుస్తోంది. దీనితో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చుట్టూ మరింత మిస్టరీ అల్లుకున్నట్లయింది. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ప్రయాణిస్తున్న ఇరువురు ప్రయాణీకులు మలేషియా దేశస్ధులు కారని, చైనా…

ఆచూకీ లేని విమానం, టెర్రరిజం అనుమానం

దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మలేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, చైనా దేశాలకు చెందిన విమానాలు, నౌకలు ఉమ్మడిగా గాలిస్తున్నప్పటికీ వారి గాలింపు ఫలవంతం కాలేదు. అమెరికా, ఐరోపాల సాయం తీసుకోవడానికి నిర్ణయించినట్లు మలేషియా మంత్రులు ప్రకటించారు. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ఇద్దరు ప్రయాణీకులు విమానంలో ఉన్నందున టెర్రరిస్టు చర్యకు గురై ఉండొచ్చన్న అవకాశాన్ని ఎవరూ నిరాకరించడం లేదు. విమానం ప్రయాణించిన తీరును బట్టి అది…