సముద్రంలోనే కూలింది, 6 మృత దేహాలు లభ్యం -ఫోటోలు
అనుకున్నట్లుగానే ఎయిర్ ఆసియా విమానం QZ 8501 విమానం జావా సముద్రంలోనే కూలిపోయిందని నిర్ధారణ అయింది. జావా సముద్రం లోని బోర్నియో ద్వీపానికి సమీపంలో విమానానికి సంబంధించిన అనేక శిధిలాలు కనపడడంతో ప్రమాదం నిర్ధారించబడింది. ప్రయాణీకులకు చెందిన 6 మృత దేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీశారు. అనేకమంది ప్రయాణీకుల మృత దేహాలు ఇంకా విమానంలోనే ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. 40 మృత దేహాలను వెలికి తీశామని మొదట ఇండోనేషియా నౌకా బలగం ప్రకటించింది. అయితే అనంతరం…