ఉక్రెయిన్ ఫైటర్ జెట్ SU-25తో కూల్చారు -2

ట్యాంకు విధ్వంసక ఇన్సెండియరీ బాంబులు, splinter-explosive బాంబులు ఆల్టర్నేట్ గా కాక్ పిట్ ను తాకితే ఏమవుతుందో ఒకసారి ఊహించండి! ఇవి ఆధునిక ట్యాంకును ధ్వంసం చేయడానికి ఉద్దేశించినవి. ఇన్సెండియరీ బాంబులు పాక్షికంగా కాక్ పిట్ గుండా ప్రయాణించి అవతలి వైపు నుండి కాస్త మారిన రూపంతో బైటికి వచ్చాయి. (ఏవియేషన్ ఫోరెన్సిక్ నిపుణులు శ్రద్ధ పెడితే వాటిని విమానం కూలిన ఏరియాలో కనుగొనవచ్చు.) మందపాటి ట్యాంకు గోడలను ఛేదించుకుని పోయే విధంగా ఈ బాంబు గుళ్లను…

పొరబాటున కూల్చారు -అమెరికా

అమెరికా ఇప్పుడు స్వరం మార్చింది. రష్యా ఇంటలిజెన్స్ అధికారుల ప్రత్యక్ష సహకారంతో తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే బక్ మిసైల్ తో మలేషియా విమానాన్ని కూల్చారని, అందుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ ఆరోపణల నుండి వెనక్కి తగ్గింది. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పొరబాటున కూల్చి ఉండవచ్చని చెబుతోంది. అయితే అందుకు కూడా తమ వద్ద సాక్ష్యాలు లేవని మెల్లగా చెబుతోంది. ఈ వ్యవహారం చూస్తే మహా భారతంలోని…

ఉక్రెయిన్: మలేషియా విమానం కూలి 295 మంది మరణం?

ఉక్రెయిన్, రష్యా సరిహద్దులో మలేషియా ఎయిర్ లైన్స్ కి చెందిన ప్రయాణీకుల విమానం కూలిపోయింది. విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వంపై పోరాడుతున్న తిరుగుబాటుదారులే క్షిపణి ప్రయోగంతో విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పశ్చిమ కార్పొరేట్ సంస్ధలు పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాయి. ఆరోపణలను తిరుగుబాటుదారులు తిరస్కరించారు. విమానాన్ని కూల్చగల మిలట్రీ పరికరాలు తమవద్ద లేవని తెలిపారు. హిందూ మహా…

ఆచూకీ లేని విమానం, మోగుతున్న సెల్ ఫోన్లు -ఫోటోలు

అనూహ్య పరిస్ధితుల్లో అదృశ్యం అయిన మలేషియా విమానం కోసం సముద్రం జల్లెడ పడుతున్నా ఇంకా ఫలితం దక్కలేదు. మొత్తం 10 దేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆలవాలం అయిన దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జలాల హక్కులపై నెలకొన్న తగాదాలను పక్కనబెట్టి మరీ ఆయా దేశాలకు చెందిన మిలట్రీ విమానాలు, సివిల్ ఏవియేషన్ విభాగాలు, సముద్ర రక్షక బలగాలు, తీర రక్షక బలగాలు (కోస్ట్ గార్డ్)  గాలింపు జరుపుతున్నాయి.…

239 మందితో సముద్రంలో కూలిన మలేషియా విమానం?

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్ కు బయలుదేరిన బోయింగ్-777 విమానం ఒకటి సముద్రంలో కూలిపోయినట్లు భయపడుతున్నారు. బయలుదేరిన 40 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు తెగిపోయిన విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దక్షిణ చైనా సముద్రంలో 10 నుండి 15 కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఇంధనం చూసి అనుమానించిన వియత్నాం నావికా దళాల ద్వారా మొదట సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం…