మలాల యూసఫ్జాయ్: అమెరికా దురాక్రమణ యుద్ధ వాస్తవాలు వాస్తవాలే, ‘కుట్ర సిద్ధాంతాలు’ కాదు

కుట్రలు లేనిదే అమెరికా ప్రపంచాధిపత్యం నడవదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో పాటు యూరప్ లో కూడా అమెరికా జరిపిన, జరిపిస్తున్న కుట్రల సమాచారం బైటికి వచ్చినప్పుడల్లా, వాటిని ‘కుట్ర సిద్ధాంతాలు’ గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కొట్టిపారేయడం పరిపాటి. అది వాటి అవసరం, ప్రయోజనం. అందువల్లనే ప్రత్యామ్నాయ వార్తా సంస్ధలు పూనుకుని ఈ కుట్రలను బైటికి తీస్తున్నాయి. మనం చేయవలసింది వాటిని గుర్తించడమే తప్ప అక్కడ కూడా పశ్చిమ పత్రికల ప్రచారంలో కొట్టుకుపోయి ‘కుట్ర సిద్ధాంతాలు’గా…

‘మలాల యూసఫ్జాయ్’: 14 యేళ్ళ బాలిక చుట్టూ అంతర్జాతీయ రాజకీయాలు -కార్టూన్

పాకిస్ధాన్ పశ్చిమ రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలోని స్వాట్ లోయలో ‘మలాల యూసఫ్జాయ్’ అనే 14 సంవత్సరాల బాలికపై హత్యా ప్రయత్నం జరిగింది. అక్టోబర్ 9 తేదీన ఆమె ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు ను మిలట్రీ చెక్ పోస్టుకి సమీపంలోనే ఆపి, దుండగులు ఆమె తలపైనా, గొంతులోనూ కాల్పులు జరిపారు. బాలికా విద్య కోసం ప్రచారం చేస్తున్నందుకు ఆమెను పాకిస్ధాన్ తాలిబాన్లు చంపడానికి ప్రయత్నించారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచారం లంకించుకున్నాయి. పాకిస్ధాన్ లో వైద్యం సరిపోలేదని…