తాత్కాలిక సెలవుకు ముగింపు…!

ఔను! తాత్కాలికంగా మూడు నెలల పాటు (కాస్త అటూ ఇటుగానే లెండి!) నేను తీసుకున్న సెలవు ఇక ముగిసింది. నా సెలవుకి కారణాలు? షరా మామూలుగా నేను ఇంతకు ముందు చెప్పినవే. మా ఇంటికి తలపెట్టిన షోకులు (పెయింట్లు, ఇంటి చుట్టూ ఫ్లోరింగ్, కొత్త లైట్లు, కొత్త కర్టెన్లు, ఇంటి బయట ఓ బాత్ రూమ్ మొ.వి) మూడు రోజుల క్రితమే పూర్తయ్యాయి. నేనేదో చెమట చిందించేసేనని కాదనుకోండి. కానీ పని సక్రమంగా -డబ్బుకి తగినట్లుగా-  జరుగుతోందా…