కన్హయ్యతో మమతను పెళ్లగించగలరా? -కార్టూన్

“కన్హైయా కుమార్ ఎన్నికల ప్రచారంలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీల తరపున పాల్గొంటారు” అని ఇరు పార్టీలు పుత్రోత్సాహంతో ప్రకటించేశాయి. తద్వారా జే‌ఎన్‌యూ విద్యార్ధుల పోరాటాన్ని తీసుకెళ్లి పార్లమెంటు/అసెంబ్లీ ఎన్నికల రొంపిలోకి దింపి స్వప్రయోజనాలకు వినియోగించడానికి ఆ పార్టీలు తలపెట్టాయి. సి‌పి‌ఎం నేత సీతారాం యేచూరి, సి‌పి‌ఐ నేత డి రాజాలు ఇద్దరూ ఈ మేరకు టి‌వి ఛానెళ్లలో కనపడి ప్రకటన చేశారు. కన్హైయా బెయిల్ పై విధించబడ్డ షరతుల రీత్యా ఆయన కేరళ, బెంగాల్ కు ప్రయాణించబోరని…

శారదా చిట్ ఫండ్ ఊబిలో మమతా బెనర్జీ! -కార్టూన్

శారదా చిట్ ఫండ్ కుంభకోణం క్రమంగా మమతా బెనర్జీని కూడా చుట్టు ముడుతోంది. సి.బి.ఐ విచారణ ఫలితంగా పలువురు త్రిణమూల్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు కుంభకోణంలో పాత్రధారులుగా, లబ్దిదారులుగా తేలుతున్నారు. చివరికి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార ఖర్చులను కూడా శారద చిట్ ఫండ్ భరించిందని అరెస్టయిన నేత ఒకరు ఆరోపించడంతో మమతా బెనర్జీని ఊబిలోకి లాగేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం అవుతోంది. త్రిణమూల్ నేత, మాజీ ఐ.పి.ఎస్ అధికారి రజత్ మజుందార్, ఆ పార్టీ…

ఫెడరల్ ఫ్రంట్, ఆల్టర్నేట్ ఫ్రంట్… ఏది ధర్డ్ ఫ్రంట్?

దేశంలో నాలుగో కూటమి రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుకోసం చర్చలు జరిపిన జయలలిత లెఫ్ట్ తో చర్చలు ముగిస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. దానితో వామపక్షాలు, ఇతర కిచిడి పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఆల్టర్నేట్ ఫ్రంట్’ లో జయలలిత చేరిక ఆగిపోయింది. ఎ.ఐ.డి.ఏం.కె అధినేత్రి వామపక్షాలతో ఎన్నికల బంధం తెంచుకోవడం ఒక ఎత్తయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫోన్ చేయడం మరో ఎత్తు. ఈ ఫోన్ కాల్ తో…

మమత ఒంటరితనం స్వయంకృతం! -కార్టూన్

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించడం భారత పాలకుల నైజం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇందులో నాలుగాకులు ఎక్కువే చదివింది. ఎన్నికల నాటి ప్రమాణాలను సంవత్సరం లోపే పూర్తి చేసేశానని ప్రకటించిన మమత ‘వాగ్దానాలను అమలు  చేయండి’ అని అడిగిన ఒక సాధారణ రైతు పైన మావోయిస్టు అని ముద్ర వేసి అరెస్టు చేయించింది. తద్వారా మావోయిస్టులు రైతుల కోసం పని చేస్తున్నారని చెప్పకనే చెప్పింది. మహిళల హక్కులు, ప్రజల ప్రజాస్వామిక హక్కులు హరించబడుతున్నాయని ఒక…

మమత చిక్కరు, దొరకరు -కార్టూన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని తమ కూటమిలో చేర్చుకోడానికి యు.పి.ఎ, ఎన్.డి.ఎ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కానీ యు.పి.ఎ నుండి బైటికి దూకిన తర్వాత త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎవరికీ ‘చిక్కరు, దొరకరు’ అన్నట్లుగా పరిస్ధితి ఉంటోంది. ఆమెకు  అనుకూలంగా వ్యవహరించడానికి రెండు కూటముల నాయకులు ప్రయత్నిస్తున్నా, ఆమె ఎవరివైపు మొగ్గు చూపుతారో ఎవరి అంచనాలకు అందడం లేదు. ఒక రోజు యు.పి.ఎ పైన యుద్ధం ప్రకటించినట్లు మాట్లాడి ఒక సంకేతం ఇచ్చినట్లు…

చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ, మమత బెనర్జీ వంచనా శిల్పం

చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇంతకాలం చెబుతూ వచ్చిన మమత బెనర్జీ తన ఉద్దేశాలు వేరే ఉన్నాయని వెల్లడి చేసుకుంది. పార్లమెంటు సమావేశాల మొదటిరోజునే, సాధ్యంకాని అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించి భంగపాటుకు గురయినట్లు దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక సమయంలో వెన్ను చూపుతోంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించే బిల్లుపై ఓటింగ్ కు ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, ఓటింగ్ అవసరం లేకుండా చేసే కుట్రలో కాంగ్రెస్ కు సహకారం…

మమతకు ప్రజల ప్రశ్నలు సుత్తీ కొడవళ్ళుగా కనిపిస్తున్నాయా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫాసిస్టు విన్యాసాలు కొనసాగుతున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలపై విరుచుకు పడడానికే వినియోగిస్తున్నది. ప్రజలకు కావలసింది శుష్క వాగ్దానాలు కావనీ, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నావని ప్రశ్నించినందుకు టి.బి తో బాధపడుతున్న ఒక సాధారణ రైతును అరెస్టు చేసి దొంగ కేసులు బనాయించింది. బుధవారం పశ్చిమ మిడ్నపూర్ లో బహిరంగ సభ పూర్తయ్యాక ఎప్పటిలాగే ప్రశ్నలు అడగాలని కోరిన మమత రైతులకోసం ఏమి చేస్తున్నారన్న ప్రశ్నను సహించలేకపోయింది.…

టి.వి ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగ్రహంతో వెళ్ళిపోయిన మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన ఫాసిస్టు ఉద్దేశాలను మరోసారి వెళ్లగక్కింది. విద్యార్ధులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బదులు “మీరంతా మావోయిస్టులు, సి.పి.ఐ (ఎం) పార్టీ వాళ్ళు” అని ఆరోపిస్తూ టి.వి ఇంటర్వూని మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. ప్రశ్నలను అడుగుతున్న విద్యార్ధులందరినీ ఫోటోలు తీసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ మోడరేటర్ సాగరికా ఘోష్ వారంతా విద్యార్ధులని చెబుతున్నా వినకుండా స్టూడియో నుండి ఆగ్రహంతో ఊగిపోతూ వెళ్లిపోయింది. పోలీసులు ఇప్పటికే…

క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

క్లుప్తంగా… 03.05.2012

జాతీయం బెంగాల్ ప్రజలు అడుక్కునేవాళ్ళు కాదు –మమత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై మూడేళ్లు వడ్డీ చెల్లింపులు నిషేధించాలని తాను చేసిన డిమాండ్ ని కేంద్రం పట్టించుకోకపోవడం పై మమత ఆగ్రహం వ్యక్తం చేసీంది. ఈ విషయంలో తన బాధ్యతను కేంద్రం విస్మరించడానికి వీల్లేదని, బెంగాల్ ప్రజలేమీ అడుక్కోవడం లేదనీ మమత బెనర్జీ వ్యాఖ్యానించింది. తాము ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదనీ అది వారు ఇచ్చిన హామీయే కనుక దాన్ని నెరవేర్చాలనీ కోరింది. “2000 నుండి…

కొత్త పుంతలు తొక్కుతున్న ‘మమత’ ఫాసిస్టు పాలన

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ఫాసిస్టు పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. భారత దేశంలోని పాలక వర్గ పార్టీలు నామ మాత్రంగా ఏర్పరుచుకున్న నియమాలను, సూత్రాలనూ సైతం ఉల్లంఘిస్తోంది. రేపిస్టులకూ, హంతకులకు మద్దతుగా రావడమే కాకుండా రైతుల ఆత్మహత్యలను బూటకంగా అభివర్ణిస్తూ ‘పచ్చి ప్రజా వ్యతిరేకి’ గా తనను తాను రుజువు చేసుకుంటోంది. మమత వ్యవహార సరళితో బెంగాల్ లోని వివిధ రంగాల మేధావులు తీవ్రంగా నిరసిస్తూ ఓ ప్రకటన జారీ చేశారు.…