జనం భారీగా వస్తేనే అన్నా వస్తారు -కార్టూన్

అవును. జనం పెద్ద సంఖ్యలో వస్తేనే అన్నా హజారే సభలకు వస్తారట. లేకపోతే రారట. ఈ సంగతి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సభ ద్వారా తెలిసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అన్నా హజారేలు ఇరువురూ హాజరు కావలసిన సభకు అన్నా రాలేదు. కారణం ఏమిటా అని చూస్తే సభకు పెద్దగా జనం రాకపోవడం వల్లనే అన్నా రాలేదని ఆయన ప్రతినిధులు వివరించారని పత్రికలు తెలిపాయి. మార్చి 12 తేదీన ఢిల్లీలో ఒక ఎన్నికల…

అన్నా హజారే రాజకీయం -కార్టూన్

“అవినీతి వ్యతిరేక పోరాటాన్ని నేను తేలిక చేసేశాను – మన దీదీని ఎన్నుకోండి చాలు – ఇక అవసరమైందంతా ఆమె పూర్తి చేసేస్తారు…” *** రాజకీయాలు తనకు సరిపడవని చెబుతూ అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నారు. మొదట అరవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పి కూడా కిరణ్ బేడీ మంత్రాంగంతో ఆయన వెనక్కి తగ్గారు. పైగా ఎన్నికల్లో తన పేరు వినియోగించడానికి వీలు లేదంటూ ఆప్ పార్టీపై ఆంక్షలు…

విభజన బుల్ డోజర్ కు మమత అడ్డం? -కార్టూన్

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నానని చెబుతున్న జగన్ పార్టీల నాయకుల్ని కలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎన్.సి.పి నేత శరద్ పవార్, జె.డి.(యు) నేత శరద్ యాదవ్ లను ఇప్పటికే కలిశారు. వీరిలో రాష్ట్ర విభజనకు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది ఒక్క మమతా బెనర్జీ మాత్రమే. గూర్ఖాలాండ్ డిమాండ్ ఎదుర్కొంటున్న మమత విభజనకు వ్యతిరేకం అని చెప్పడంలో ఆశ్చర్యంలో లేదేమో. “తెలంగాణ…

యు.పి.ఎ కి మమత సెలవు, మైనారిటీలో కేంద్ర ప్రభుత్వం

మమత బెనర్జీ చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతి, డీజెల్ రేట్ల పెంపుదల, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలో భారీ కోత… నిర్ణయాలను ఉపసంహరించుకోవాలంటూ మమత విధించిన 72 గంటల గడువు ముగిశాక మద్దతు ఉపసంహరిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ప్రకటించింది. కోల్ గేట్ కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ఒక్కుమ్మడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్న అద్వానీ ఆరోపణలను మమత ఉద్ఘాటించింది. ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకున్నట్లయితే…

నిన్నటి వరకు మమత, ఇపుడు ములాయం కూడా… -కార్టూన్

యు.పి.ఏ కి కష్టాలు ముమ్మరం అయినట్లు కనిపిస్తోంది. ‘మద్దతు ఉపసంహరిస్తా’ అంటూ మమతా బెనర్జీ తరచుగా బెదిరించే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ములాయం సింగ్ యాదవ్ కూడా ఆమెకు జత చేరినట్లు కనిపిస్తోంది. యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి తో పంకిలమయిందని ఆయన చేసిన వ్యాఖ్య గురువారం పత్రికల పతాక శీర్షికలను ఆకర్షించింది. రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే నిర్ణయాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూ వచ్చింది. ఆమెను మేనేజ్ చెయ్యడానికి అమెరికా విదేశాంగ…

మమతకి గడ్డి పెట్టిన కోల్ కతా హై కోర్టు

తన ప్రభుత్వంలో జరుగుతున్న హత్యలకు 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనే కారణం అంటూ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ తన భాద్యతలను ఎలా తప్పించుకోగలదని కోల్ కతా హై కోర్టు తీవ్రంగా విమర్శించింది. సి.పి.ఐ(ఎం) పార్టీ నాయకులను చంపిన కేసులో పోస్టు మార్టం రిపోర్టు కూడా మృతుల బంధువులకు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. శుక్రవారం నాలుగు గంటల లోగా పోస్టు మార్టం రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్ల పాలన…

పెట్రోల్ ధర తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తా -మమత బెనర్జీ

యు.పి.ఎ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ శుక్రవారం పెట్రోల్ ధర పెంపును నిరసించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే తాను యు.పి.ఏ కు మద్దతు ఉపసంహరిస్తానని ప్రకటించింది. “నేను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాకె మెయిల్ చేయడం లేదు. కాని మా పార్టీని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. తన హెచ్చరికను ప్రధాని మన్మోహన్ జి20 సమావేశాలనుండి వెనక్కి వచ్చేవరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మమతా బెనర్జీ అభ్యంతరం తమ పార్టీతో…