ఇ-బ్రిక్స్ మా కల -ఈజిప్టు అధ్యక్షుడు

ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి…

మన్మోహన్ కి కోరలు మొలిచాయి! -కార్టూన్

ఎప్పుడో తప్ప మాటలు పెగలని ప్రధాని మన్మోహన్ సింగ్ కి కొత్తగా ఉన్నట్లుంది కోరలు మొలిచాయని పత్రికలు గుసగుసలు పోతున్నాయి. ఇటలీ మెరైన్లు ఇండియాకు తిరిగి రాబోరని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో ప్రధాన మంత్రి ఉభయ సభల్లో కాస్త గట్టిగా మాట్లాడడం ఈ గుసగుసలకు కారణం. ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి ఇటలీ నౌకపై ఉన్న మెరైన్లు కాల్చి చంపడంతో వారిని అరెస్టు చేసి సుప్రీం కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.…

2జి ఫీజు 36,000 కోట్లు ఉండాలని చెప్పా, ప్రధాని పట్టించుకోలేదు -కేబినెట్ కార్యదర్శి

2జి కుంభకోణం విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిత అమాయకత్వం ఒట్టి నటనే అన్న సంగతి అనూహ్య రీతిలో వెల్లడయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణలో సి.పి.ఐ సభ్యుడు గురుదాస్ దాస్ దాస్ గుప్తా తరచి తరచి అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన మాజీ కేబినెట్ కార్యదర్శి అసలు సంగతి కక్కడంతో ప్రధాని దాపరికం గుట్టు రట్టయ్యింది. 2జి స్పెక్ట్రమ్ ఎంట్రీ ఫీజు అప్పటి మార్కెట్ ధరల ప్రకారం 36,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించాలని తాను…

అవినీతిని వదిలి ప్రజాస్వామిక చట్టాలపై ప్రధాని పోరాటం -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రకటనలు అత్యంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి. అవినీతి నిర్మూలనకి చట్టం తెమ్మంటే అలా అడిగినవాడికి అవినీతిని అంటగడతారు. లోక్ పాల్ చట్టం తెమ్మంటే ప్రభుత్వాన్ని ప్రవేటు సంస్ధలు బ్లాక్ మెయిల్ చేయడాన్ని సహించనంటూ లక్షలాది కోట్ల అవినీతిపై పల్లెత్తు మాట మాట్లాడడు. పాలకుల, కంపెనీల అవినీతిని కొద్దో గొప్పో వెల్లడిస్తున్న సమాచార హక్కు చట్టం వల్ల ప్రవేటు వ్యక్తుల ప్రైవసీ హక్కులకి భంగం కనుక సవరిస్తానని హుంకరిస్తున్నాడు. సమాచార…

అంతర్జాతీయ సభలో డీజెల్ రేట్లపై ప్రధానికి నిరసన

న్యూ ఢిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మన్మోహన్ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ‘ఆసియాలో ఆర్ధిక వృద్ధి, కార్పొరేట్ వాతావరణంలో మార్పులు’ అన్న అంశంపై జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించడానికి లేచినపుడు సుప్రీం కోర్టు అడ్వకేటు ‘సంతోష్ కుమార్’ చొక్కా విప్పి నిరసన తెలిపాడు. పెంచిన డీజెల్ ధరలని తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాడు. నినాదాలతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్ది నిమిషాలు ఆపవలసి వచ్చిందని ‘ది హిందూ’ తెలిపింది. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్…

మధ్య ప్రదేశ్ కోల్-గేట్: కాంగ్రెస్, బి.జె.పి ఇరువురూ పాత్రధారులే

బొగ్గు కుంభకోణం దరిమిలా ప్రధాని రాజీనామాకు బి.జె.పి పట్టుబడుతున్న నేపధ్యంలో బి.జె.పి ముఖ్యమంత్రుల ‘మినీ బొగ్గు కుంభకోణాలు’ బైటికి వస్తున్నాయి. 2011 లో రిలయన్స్, ఎస్సార్ కంపెనీలకు బొగ్గు గనులు తవ్వకానికి అనుమతి ఇవ్వడానికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ నిర్వహించి సఫలమయిన విషయాన్ని ‘ది హిందూ’ పత్రిక వెల్లడి చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి జై రామ్ రమేష్ తీవ్ర అభ్యంతరాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…

సిరియా, పాలస్తీనాలకు మన్మోహన్ బాసట, ప్రతిష్ట కోసం పాకులాట

ఇరాన్ లో జరుగుతున్న అలీనోద్యమ (Non-Aligned Movement) సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరియాలో పశ్చిమ దేశాలు సాగిస్తున్న అల్లకల్లోలం పై ఇప్పటిదాకా నోరు మెదపని ప్రధాని “సిరియాలో బైటి దేశాల జోక్యం తగద” ని ప్రకటించాడు. ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా డెబ్భై సంవత్సరాలనుండి పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు కూడా మద్దతు ప్రకటించాడు. జి-20 గ్రూపులో అమెరికా, యూరప్ దేశాల సరసన కూర్చుని కూడా ముఖ్యమైన అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ…

నిష్కళంకుడి బండారం బట్టబయలు, 1.86 ల.కోట్ల బొగ్గు కుంభకోణానికి మన్మోహన్ సారధ్యం

నిష్కళంకుడుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రధాని మన్మోహన్ సింగ్ నిజ స్వరూపం ఏమిటో దేశానికి తెలిసి వచ్చింది. 1.86 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సారధ్యం వహించి ప్రజల వనరులను ప్రవేటు ముఠాలకు అప్పజెప్పిన మన్మోహన్ ‘మిస్టర్ అన్ క్లీన్’ గా అవతరించాడు. 2జి కుంభకోణం గురించి తనకు తెలియదని బుకాయించి తప్పించుకున్న ప్రధాని ‘బొగ్గు కుంభకోణం’ లో కన్నంలో వేలితో అడ్డంగా దొరికిపోయాడు. బొగ్గు గనులను వేలం వేయాలన్న ప్రతిపాదన 2004 లో…

కలాం నిజం చెప్పడం లేదు -సుబ్రమణ్య స్వామి

ప్రధాన మంత్రి గా సోనియా గాంధీ నియామకం విషయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిజాలు చెప్పడం లేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించాడు. ప్రధాని పదవికి సోనియా నియామకం జరగదని కలాం ఒక లేఖ కూడా సోనియాకి రాశాడనీ, తీరా ఇప్పుడు అందుకు విరుద్ధంగా చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఇటలీ పౌరసత్వం రద్దు చేసుకోకుండా భారత పౌరసత్వం పొందినందున సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడానికి నాయపరమైన సమస్యలున్నాయని తాను కలాంకి వివరించాననీ,…

టర్నింగ్ పాయింట్స్: సోనియా ప్రధాని పదవికి తగునని భావించిన కలాం

2004 లో విస్తృతంగా జరిగిన మీడియా ప్రచారానికి విరుద్ధంగా సోనియా కోరినట్లయితే ఆమెను ప్రధానిగా అవకాశం ఇవ్వడానికి తాను సిద్ధపడినట్లు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ‘టర్నింగ్ పాయింట్స్’ పుస్తకంలో వెల్లడి చేశాడు. సోనియాను ప్రధానిని చేయడానికి వ్యతిరేకంగా అనేకమంది రాజకీయ నాయకులు, పార్టీలు తీవ్ర స్ధాయిలో ఒత్తిడి తెచ్చినప్పటికీ, ‘రాజ్యాంగబద్ధంగా సమర్ధనీయమైన’ ఏకైక అవకాశం అదే అయినందున ఆమెను ప్రధానిని చేయడం తప్ప తనకు మరొక మార్గం లేదని కలాం తన పుస్తకంలో వివరించాడు.…

అంతా దయానిధి మారన్ వల్లనే -2జి పై ప్రధాని మన్మోహన్

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2జి కుంభకోణంపై నోరు విప్పాడు. తమ బాధ్యత గురించి మాట్లాడకుండా నేరాన్ని టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పైకి నెట్టేశాడు. దయానిధి రాసిన ఉత్తరంతోటే తాను 2జి స్పెక్ట్రం విషయాన్ని మంత్రుల బృందం పరిశీలననుండి తప్పించి పూర్తిగా టెలికం శాఖ నిర్ణయానికి అప్పజెప్పానని చెప్పాడు. అమెరికా నుండి ఇండియా వస్తూ విమానంలోనే మన్మోహన్ సింగ్ పత్రికా విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఇండియాలో విమానం దిగే నాటికి ఇంటర్వ్యూ…

లేదు లేదంటూనే ప్రధాని, చిదంబరంలను మళ్ళీ కోర్టులో ప్రస్తావించిన ఎ.రాజా

సోమవారం కోర్టులో తాను ప్రధాని మన్మోహన్, మాజీ అర్ధిక మంత్రి, ప్రస్తుత హోం మంత్రి చిదంబరం లకు వ్యతిరేకంగా ఆరోపణలను చేశాననడం మీడియా సృష్టి అవి చెబుతూ, మీడియాను చేస్తే సరిగా రిపోర్టు చేయమనండి లేదా బైటికి పంపించండి అని మంగళవారం జడ్జిని కోరిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, మళ్ళీ మన్మోహన్, చిదంబరం ల పేర్లను తన వాదనలో ప్రస్తావించాడు. సోమవారం కంటే ఈ సారి కాసింత నేరుగానే వారిపై ఆరోపణలు సంధించే ప్రయత్నం చేశాడు.…

ఆయిల్ రేట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేయాల్సిందే -అహ్లూవాలియా

ధనిక స్కూళ్ళలో చదివి, ఆక్స్‌ఫర్డ్ లోనో, హార్వర్డ్ లోనో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఐ.ఎం.ఎఫ్ లాంటి ప్రపంచ వడ్డీ వ్యాపార సంస్ధల్లో ఉద్యోగం చేసినవాళ్ళని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఏమవుతుంది? “నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే, ఒరే” అని ఓ కవి పాడినట్లుగానే అవుతుంది. భారత దేశ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పరిస్ధితి కూడా అలాంటిదే. “ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినపుడు ఆ భారం ప్రజలమీద మోపడానికి…

లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సీరియస్‌గా లేదు, మరోసారి నిరాహార దీక్ష చేస్తా! -అన్నా హజారే

కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా…

అమెరికా మేలు కోసం కేబినెట్ మంత్రుల్ని మార్చిన భారత ప్రధాని -వికీలీక్స్

“భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కేబినెట్ మంత్రులను నియమించడం, మార్చడం చేస్తున్నాడు” ఇది ఏ వామపక్షాలో, విప్లవకారులో చేసిన ఆరోపణ కాదు. ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితుడైన డేవిడ్ మల్ఫోర్డ్ అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిన ఓ కేబుల్ (టెలిగ్రాం ఉత్తరం) సారాంశం. భారతదేశ విప్లవ పార్టీలు భారత పాలకులు భారత ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తమకు ఎంగిలి మెతుకులు విసిరే విదేశీ పాలకుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని…