మన్మోహన్ సి.బి.ఐ ని ఆహ్వానించారు -కార్టూన్

బొగ్గు కుంభకోణం విషయంలో సి.బి.ఐ తనను విచారించదలుచుకుంటే దానికి అడ్డంకులేమీ లేవని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొట్ట తొలిసారి నిన్న ప్రకటించారు. 2జి కుంభకోణంలో అనుమానాలు కమ్ముకున్నా ‘నాకు తెలియదు, నాకు సంబంధం లేదు’ అంటూ తప్పించుకున్న ప్రధాని బొగ్గు కుంభకోణంలో ‘విచారణకు సిద్ధం’ అని ప్రకటించినందుకు దేశ ప్రజలు సంతోషించాలా లేక ఎన్ని ఆరోపణలు వచ్చినా చూరు పట్టుకుని వేలాడుతున్నందుకు సిగ్గుపడాలా? మన్మోహన్ సింగ్, భారత దేశపు అత్యున్నత నేర విచారణ సంస్ధకు సమర్పించిన…

ఎలాగైతేనేం, ప్రధానీ నెంబర్ 1 అయ్యారు! -కార్టూన్

భారత దేశంలో అత్యున్నత అధికార పీఠం ప్రధాన మంత్రి పదవి. రాష్ట్రపతిని ప్రధమ పౌరుడిగా చెప్పినా రాజ్యాంగం ఆయన చేతుల్లో అధికారాలు ఏమీ ఉంచలేదు. ఉన్న అధికారాలు అలంకార ప్రాయం మాత్రమే. కేబినెట్ సలహాను పాటించడమే ఆయనకి ఉన్న అధికారం. ప్రతి చట్టం పైనా ఆయన సంతకం అయితే ఉండాలి గానీ, నిర్ణయం మాత్రం కేబినెట్, దాని అధినేత అయిన ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. అంటే ఆచరణ, అధికారాల రీత్యా ప్రధాన మంత్రే నెంబర్ 1. కానీ…

ప్రధాని సేవ ప్రజలకు కాదు, ప్రభు వర్గాలకు -కార్టూన్

మంత్రి: దయచేసి అలాంటి దాడులు చేయకుండా సంయమనం పాటించండి. మన దేశ పెట్టుబడి వాతావరణానికి అది నష్టకరం- గౌరవనీయులైన పారిశ్రామికవేత్తలను గాయపరిస్తే… ప్రధాని: ?! ——————————— ప్రధాన మంత్రి మన్మోహన్ గారికి ప్రభుత్వం లోనూ, కాంగ్రెస్ లోనూ ఉన్న గౌరవం ఏపాటిదో వివరించే ఉదాహరణలు కోకొల్లలు. సోనియా గాంధీ విదేశీయత ప్రధాని పదవికి అడ్డు రావడం, పి.వి.నరసింహారావు ఏలుబడిలో భారత దళారీ పెట్టుబడిదారులకు, విదేశీ సామ్రాజ్యవాదులకు నమ్మకంగా సేవలు చేయడం ద్వారా సాధించిన పలుకుబడి అచ్చిరావడంతో దేశ…

మన్మోహన్ ఫైలుకి పరిష్కారం లేదు -కార్టూన్

ది హిందు పత్రికలో కేశవ్ కార్టూన్లు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఒక్కోసారి కేశవ్ కవి కాబోయి కార్టూనిస్టు అయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కార్టూన్లకు కవిత్వానికి ఉన్నంత లోతు ఉంటుంది. ఆ లోతు ఒక్కోసారి చాలామందికి అందదు. (నాక్కూడా.) ఈ కార్టూన్ అందులో ఒకటిగా కనిపిస్తోంది. ‘మిస్టర్ క్లీన్’గా ఒకప్పుడు మన్ననలు అందుకున్న మన్మోహన్ సింగ్ ఇప్పుడు అవినీతి రాజుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మన్మోహన్ కి ఆపాదిస్తున్న అవినీతి ద్వారా ఆయన స్వయంగా లబ్ది పొందకపోవడమే…

ప్రధానికి సోనియా అభయ హస్తం -కార్టూన్

“ఏమీ పట్టించుకోవద్దు, అలా వెళ్తూనే ఉండండి!” – 2జి కుంభకోణంలో తన పాత్రపై మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన ఆరోపణలకు బదులివ్వాలని ప్రతిపక్షాలు అరిచి గీపెడుతున్నా ప్రధాన మంత్రి నోరు విప్పడం లేదు. బి.జె.పి నాయకుడు యశ్వంత్ సిన్హా ముచ్చటగా మూడోసారి ఈ విషయమై ప్రధానికి లేఖ రాశారు. ‘మీ మౌనం మీ దోషిత్వాన్ని ఎత్తి చూపుతోంది’ అని ఆయన ఘాటుగా లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మౌనం వహించడం, విదేశీ కంపెనీలకు దోచి…

బొగ్గు కుంభకోణం: ప్రధాని నోట ‘జీరో లాస్’ -కార్టూన్

2జి స్పెక్ట్రం కుంభకోణంలో అసలు నష్టమే లేదని చెప్పి ‘జీరో లాస్’ వాదనతో టెలికాం మంత్రి కపిల్ సిబాల్ అప్రతిష్టపాలయ్యాడు. ‘వొళ్ళు దగ్గర పెట్టుకోమం’టూ సుప్రీం కోర్టు చేత చీవాట్లు కూడా తిన్నాడు. సిబాల్ అనుభవం నుండి ప్రధాని పాఠాలు నేర్చుకోనట్లు కనిపిస్తున్నది. అత్యంత కనిష్ట స్ధాయిలో నష్టాన్ని అంచనా వేసినప్పటికీ 1,87,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చిందని చెప్పిన కాగ్ లెక్కలు వివాదాస్పదమని ప్రధాని వ్యాఖ్యానించాడు. ‘జీరో లాస్’ వాదనకు మద్దతుగా వివిధ అంశాలను…

ప్రధాని పై సి.బి.ఐ విచారణ వృధా -అన్నా బృందం

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంత్రిత్వంలో చోటు చేసుకున్న ‘బొగ్గు గనుల కుంభకోణం’ పై సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తే అది వృధా ప్రయాసేనని అన్నా బృందం కొట్టిపారేసింది. విచారణ సి.బి.ఐ కి అప్పగిస్తే ప్రధానికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం ఖాయమని పేర్కొంది. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అయిన సి.బి.ఐ ప్రధాని పై విచారణ ఎలా చేస్తుందని ప్రశ్నించింది. కాంగ్రెస్ రాజకీయ మిత్రులయిన ములాయం, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ లపై సంవత్సరాల తరబడి విచారణ చేస్తున్నా…

మన్మోహన్, ప్రణబ్, ఇంకా 15 మంత్రుల అవినీతిపై విచారణ చేయాలి -టీం అన్నా

అన్నా బృందం బ్రహ్మాస్త్రం సంధించినట్లు కనిపిస్తోంది. సత్య సంధుడుగా యు.పి.ఏ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అవినీతికి పాల్పడ్డాడని’ ఆరోపించింది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తో పాటు మరో 13 మంది కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టింది. బొగ్గు గనుల కేటాయింపులపై కాగ్ నివేదికను  ప్రధానిపై అవినీతి ఆరోపణలకు ఆధారంగా చూపింది. రిటైర్డ్ న్యాయమూర్తులతో ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరింది. అన్నా బృందం ఆరోపణలను కాంగ్రెస్…