సిరియా చర్చలు: ఇరాన్ కు ఆహ్వానం

మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాధాన్యతను పశ్చిమ దేశాలు గుర్తించక తప్పడం లేదా? సిరియా తిరుగుబాటు విషయంలో త్వరలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ చర్చలకు ఇరాన్ కూడా హాజరు కావాలని ఐరాస అధిపతి ఆహ్వానించడంతో ఈ అనుమానం కలుగుతోంది. జెనీవా చర్చలలో ఇరాన్ పాత్రను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వస్తోంది. బేషరతుగా పిలిస్తేనే పాల్గొంటానని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో సిరియా చర్చల్లో ఇరాన్ కూడా పాల్గొనాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఆహ్వానించడం…

ఆఫ్ఘనిస్తాన్: అమెరికాను కాదని ఇరాన్ తో స్నేహ ఒప్పందం

‘లోయ జిర్గా’ ఆమోదించిన తర్వాత కూడా అమెరికాతో ‘భద్రతా ఒప్పందం’ పై సంతకం పెట్టకుండా తాత్సారం చేస్తున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇరాన్ కు వెళ్ళి మరీ స్నేహ-సహకార ఒప్పందంపై సంతకం చేసేశారు. ఆఫ్ఘన్ ప్రజలకు భద్రత ఇవ్వడంపై హామీ ఇవ్వకుండా, 2014 తర్వాత కూడా అమెరికా, నాటో సేనలు ఆఫ్ఘన్ లో కొనసాగింపజేసే ఒప్పందంపై సంతకం చేసేది లేదని కర్జాయ్ రెండు వారాల క్రితం తిరస్కరించారు. కానీ ‘ప్రాంతీయ భద్రత’ కోసం ఇరాన్ తో…

లెబనాన్: ఆత్మాహుతి దాడిలో ఇరాన్ రాయబారి దుర్మణం

లెబనాన్ రాజధాని బీరుట్ ను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. నిత్యం రగులుతున్న పొయ్యి పైన ఉడుకుతున్నట్లు ఉండే మధ్య ప్రాచ్యంలో, అందునా బీరుట్ లో బాంబు పేలుళ్లు కొత్తకాకపోయినా ఒక దేశ రాయబారి మరణించడం మాత్రం తీవ్ర పరిణామమే. 23 మంది మరణానికి, మరో 146 మంది గాయపడడానికి దారి తీసిన పేలుళ్లకు ఆత్మాహుతి దాడి కారణమని రష్యా టుడే తెలిపింది. పేలుళ్లకు తామే బాధ్యులమని ఒక ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ ప్రకటించింది. అయితే ఇరాన్, సిరియాలు…

అమెరికన్లను ఉద్దేశిస్తూ పుతిన్ రాసిన లేఖ -అనువాదం

(ఈ లేఖను సెప్టెంబర్ 11 తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. సిరియా తిరుగుబాటుదారులు ఆగస్టు 21 తేదీన సౌదీ అరేబియా అందించిన రసాయన ఆయుధాలు ప్రయోగించి వందలాది మంది పౌరులను బలిగొన్న దుర్మార్గాన్ని సిరియా ప్రభుత్వంపై మోపి ఆ దేశంపై దాడికి అమెరికా సిద్ధపడుతున్న నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ లేఖ రాశాడు. లేఖ రాసేనాటికి సిరియా రసాయన ఆయుధాలను ఐరాస పర్యవేక్షణలోకి తేవడానికి రష్యా ప్రతిపాదించడం, సిరియా అందుకు అంగీకరించడం జరిగిపోయింది. అమెరికా…

అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి…

సిరియా: 2 రోజులు కాదు, ఉధృత దాడికే సెనేట్ కమిటీ ఆమోదం

శాంతి కపోతం ఇప్పుడు ఇనప రెక్కల్ని తొడిగిన డేగగా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతిని బారక్ ఒబామాకు ఇచ్చినందుకు నోబెల్ కమిటీ సిగ్గుపడుతున్నదో లేదో గానీ సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మాత్రం ఖచ్చితంగా మరోసారి చనిపోయి ఉంటాడు. మొదట రెండు రోజుల పరిమిత దాడి అని చెప్పిన ఒబామా ఆ తర్వాత సెనేట్ కమిటీలో చర్చకు పెట్టకుముందే

సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న ఇరాన్

సిరియా కిరాయి తిరుగుబాటులో స్టేక్స్ పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా, కతార్, టర్కీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సిరియా తిరుగుబాటులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ దేశాల మద్దతుతోనే ఆల్-ఖైదా టెర్రరిస్టులు సిరియా ప్రజలపై మారణహోమం సాగిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు అందిస్తున ధన, ఆయుధ సహాయంతో అధ్యక్షుడు బషర్ ఆల్-అసద్ కూల్చివేతకు రెండేళ్లుగా సాయుధంగా తలపడుతున్నారు. ఇరాన్, రష్యాల మద్దతుతో కిరాయి తిరుగుబాటును ఎదుర్కొంటున్న సిరియా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సహకరించడానికి ఇప్పుడు…

టర్కీ: సిరియా తిరుగుబాటు ఎగదోస్తూ, సొంత ప్రజలపై ఉక్కుపాదం

సిరియా సెక్యులర్ పాలకుడు బషర్ అసద్ ను గద్దె దింపడానికి టర్కీ మతతత్వ పాలకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేయని ప్రయత్నం లేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పశ్చిమ రాజ్యాలతో కుమ్మక్కై సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు తమ భూభాగం పైనే శిక్షణా శిబిరాలు నెలకొల్పి సిరియాకు పంపుతున్న ఘనత ఎర్డోగాన్ సొంతం. సిరియాలో ప్రజలపైనా, ప్రభుత్వ వ్యవస్ధల పైనా మారణ హోమం సృష్టిస్తున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులకు టర్కీ ద్వారా పశ్చిమ దేశాలు అనేక మారణాయుధాలు సరఫరా…

ఎస్-300 సిరియాకి ఇచ్చావో…, రష్యాకి ఇజ్రాయెల్ హెచ్చరిక

సిరియా యుద్ధంలో ‘గేమ్ ఛేంజర్’ గా రష్యా టుడే అభివర్ణించిన ఎస్-300 క్షిపణుల సరఫరా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేయొద్దంటూ ఇజ్రాయెల్ మరోసారి రష్యాను కోరింది. ఈసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేసినట్లయితే షిప్పింగ్ చేస్తున్న వాహనాలపై దాడి చేసి నాశనం చేస్తామని హెచ్చరించింది. కాగా క్షిపణుల సరఫరాను రష్యా గట్టిగా సమర్ధించుకుంది. సిరియాతో కుదుర్చుకున్న పాత ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నామని తెలియజేసింది. ఇజ్రాయెల్ రక్షణ…

టెర్రరిస్టులకు మద్దతుగా ఇజ్రాయెల్ ట్యాంకు, ధ్వంసం చేసిన సిరియా

పశ్చిమ మీడియా రిపోర్ట్ చేయని వార్త ఇది. సరిహద్దు దాటి సిరియాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకును సిరియా బలగాలు ధ్వంసం చేశాయని సిరియా మిలట్రీ కమాండ్ తెలియజేసింది. ఈ మేరకు గ్లోబల్ రీసర్చ్ సంస్ధ అధినేత ప్రొఫెసర్ మైఖేల్ చోసుడోవ్ స్కీ తమ వెబ్ సైట్ లో మంగళవారం సమాచారం ప్రచురించారు. సిరియాలో ఆల్-ఖైదా శాఖ ఆల్-నుస్రా ఫ్రంట్ టెర్రరిస్టులు చావు దెబ్బలు తింటూ స్ధైర్యం కోల్పోతున్న స్ధితిలో వారిని ఉత్సాహ పరిచే ఉద్దేశ్యంతో ఇజ్రాయెల్ తన…

సిరియా: ఐరాసలో అమెరికాకు పడిపోతున్న మద్దతు

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అమెరికా క్రమంగా మద్దతు కోల్పోతోంది. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలతో పాటు మధ్య ప్రాచ్యంలోని వివిధ ఇస్లాం మత ఛాందస రాజ్యాలు మద్దతు ఇస్తున్న కిరాయి తిరుగుబాటుదారులు సిరియా ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలు క్రమంగా వెల్లడి అవుతుండడంతో పశ్చిమ రాజ్యాల ఎత్తుగడలకు మద్దతు ఇవ్వడానికి వివిధ దేశాలు వెనకాడుతున్నాయి. బుధవారం పశ్చిమ దేశాల మద్దతుతో ఐరాసలో కతార్ ప్రవేశపెట్టిన తీర్మానానికి గతం కంటే మద్దతు తగ్గిపోవడాన్ని అంతర్జాతీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.…

ఇరాన్ పుణ్యం, సిరియా సమస్యలో ఇండియా మాటకు విలువ!

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో ఇండియా మాట చెల్లుబాటు అయ్యేందుకు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అలీన దేశాల కూటమి ‘అలీనోద్యమం’ (Non-Aligned Movement) నాయకురాలుగా ఇరాన్ గత యేడు బాధ్యత తీసుకున్న నేపధ్యంలో పశ్చిమ రాజ్యాల ప్రాభవానికి ప్రత్యామ్నాయ శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఇరాన్ ప్రారంభించింది. ఈ కృషిలో ఇండియాను భాగస్వామిగా స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్…

కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య…

ఇ-బ్రిక్స్ మా కల -ఈజిప్టు అధ్యక్షుడు

ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి…

మావో మూడు ప్రపంచాలు -ఈనాడు ఆర్టికల్ 5వ భాగం

ఈ రోజు ఈనాడు చదువు పేజిలో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ ఐదవ భాగం వచ్చింది. ఇందులో మధ్య ప్రాచ్యం, బ్రిక్స్, బేసిక్, మూడు ప్రపంచాల సిద్ధాంతం తదితర అంశాలను చర్చించబడింది. ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్  క్లిక్ చేస్తే ఆ పేజికి వెళ్లొచ్చు. కింద బొమ్మని క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీలో ఆర్టికల్ చదివచ్చు.