ఇంతకు మించిన దుఃఖం ఉంటుందా? -కత్తిరింపులు

భార్య చనిపోతే ఆమె శవాన్ని ఏకాఎకిన భుజాన వేసుకుని 60 కి.మీ దూరం లోని ఇంటికి కాలి నడకన బయలుదేరిన భర్త! జబ్బు పడిన కొడుకుకి వైద్యం చేయించడం కోసం అతన్ని భుజం మీద వేసుకుని, వైద్యం అందక తన భుజం మీదనే ప్రాణాలు వదిలాడని తెలియక  డాక్టర్ల మధ్య పరుగులు పెట్టిన తండ్రి! పురుటి నొప్పులు పడుతున్న కూతురిని సైకిల్ వెనక సీటుపై కూర్చో బెట్టుకుని వెళ్ళి, ప్రసవం అయ్యాక పసికందుతో సహా అదే సైకిల్…

వ్యాపం దర్యాప్తు ముగుస్తోందిట! -కార్టూన్

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్: దర్యాప్తు ఇక ముగింపుకు వస్తోంది! ****************** ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్’ అన్నది మధ్య ప్రదేశ్ లో వివిధ కోర్సులకు, ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. ఆంగ్లంలో దీని పేరు: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు. పొడి అక్షరాల్లో ఎం.పి.పి.ఇ.బి గా దీన్ని పిలుస్తారు. ప్రి-ఇంజనీరింగ్, ప్రి-మెడికల్, ఎం.సి.ఏ, టీచింగ్, పోలీస్ తదితర కోర్సులు, ఉద్యోగాల అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహించడం ఈ సంస్ధ పని. ఈ సంస్ధలోని ఉన్నతాధికారులు…

దళిత పెళ్ళి కొడుకు గుర్రం ఎక్కితే రాళ్ళు పడతాయ్!

రిజర్వేషన్లు ఇంకానా? అని ప్రశ్నించే అమాయకోత్తములకు తామున్న బావి నుండి బైటికి వచ్చి లోకం చూడాలని పిలుపు ఇచ్చే ఘటన ఇది! దళిత కులానికి చెందిన ఓ పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి ఊరేగేందుకు వీలు లేదని శాసించిన ఉన్నత కులాలు తమ శాసనాన్ని మీరినందుకు రాళ్ళతో దాడి చేశారు. గుర్రాన్ని లాక్కెళ్ళారు. మరో గుర్రం తెచ్చుకున్న పెళ్లి కొడుకు రక్షణ కోసం పోలీసులు అతని తలకి హెల్మెట్ తొడగడం బట్టి దేశంలో కుల రక్కసి ఇంకా…

ఆడది అలా చూడకుండా మగాడేమీ చెయ్యడు -కాంగ్రెస్ నాయకుడు

ఒకరో, ఇద్దరో నాయకులైతే నాలుగు మాటలతో విమర్శించి ఛీ, ఛీ అని ఊరుకుంటాం. ఒకసారి, రెండు సార్లు అయినా ‘సరికాదు, సవరించుకోండి’ అని చెబుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు గుంపంతా అదే బాపతైతే ఎన్ని విమర్శలు చేయాలి. ఎన్ని ఛీ, ఛీలు కొట్టాలి, ఎన్నిసార్లు సవరించుకోమని చెప్పాలి!? మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కూడా అయిన ఓ పెద్ద మనిషి మహిళలు ఆహ్వానించే విధంగా చూడకపోతే మగాళ్లు అసలు వారినేమీ ఇబ్బంది పెట్టరు…

ఇంకో అత్యాచారం, ఈసారి స్విస్ మహిళ పైన

జర్మనీ మహిళ పైన ఒడిషా మాజీ డి.జి.పి పుత్ర రత్నం ఏడేళ్ల క్రితం అత్యాచారం చేసిన కేసులో నిందితుడి గుర్తింపు గురించి నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఒకవైపు మల్లగుల్లాలు పడుతుండగానే మధ్య ప్రదేశ్ లో ఒక స్విస్ మహిళ పైన అత్యంత దారుణంగా ఎనిమిది మంది భారతీయులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీ బస్సులో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం దరిమిలా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఇప్పటికే మారుమోగుతున్నాయి. స్విస్ బాధితురాలి పైన జరిగిన…

మధ్య ప్రదేశ్ కోల్-గేట్: కాంగ్రెస్, బి.జె.పి ఇరువురూ పాత్రధారులే

బొగ్గు కుంభకోణం దరిమిలా ప్రధాని రాజీనామాకు బి.జె.పి పట్టుబడుతున్న నేపధ్యంలో బి.జె.పి ముఖ్యమంత్రుల ‘మినీ బొగ్గు కుంభకోణాలు’ బైటికి వస్తున్నాయి. 2011 లో రిలయన్స్, ఎస్సార్ కంపెనీలకు బొగ్గు గనులు తవ్వకానికి అనుమతి ఇవ్వడానికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ నిర్వహించి సఫలమయిన విషయాన్ని ‘ది హిందూ’ పత్రిక వెల్లడి చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి జై రామ్ రమేష్ తీవ్ర అభ్యంతరాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…

నా కొడుకుది రాజకీయ హత్య -ఐ.పి.ఎస్ అధికారి తండ్రి

మధ్య ప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయిన ఐ.పి.ఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను రాజకీయ నాయకులే హత్య చేహించారని అతని తండ్రి, పోలీసు అధికారి కూడా అయిన కేశవ్ దేవ్ ఆరోపించాడు. కొద్ది రోజులుగా తాను అక్రమ మైనింగ్ కి సంబంధించిన ట్రక్కులను సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతో వదిలి పెడుతున్నారని తన కొడుకు చెప్పాడని ఆయన తెలిపాడు. రాజకీయ కుట్ర వల్లనే తన కొడుకు హత్యకు గరయ్యాడని కేశవ్…