విషతుల్యమైన పళ్ళెం -ది హిందు సంపాదకీయం

బీహార్, శరణ్ జిల్లాలో కనీసం 22 మంది బడి పిల్లలకు ప్రాణాంతక పరిణామాలను రుచి చూపించిన రోజువారీ మధ్యాహ్న భోజనం భారత దేశంలోని విస్తార భాగాల్లో పాఠశాల విద్య ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదో వెల్లడి చేస్తోంది. ప్రభుత్వాలు ఒక పాఠశాల నిర్మాణానికి కాసింత చోటు చూపించలేకపోవడం, ఆహార పదార్ధాలు కలుషితం అయ్యే ప్రమాదానికి లోనుకాకుండా నిలవ చేయలేకపోవడం… ఈ అంశాలు సార్వత్రిక ప్రాధమిక విద్య పట్ల ప్రభుత్వాల నిబద్ధత ఏపాటిదో పట్టిస్తున్నాయి. మౌలిక సౌకర్యాలకు సంబంధించి,…

మధ్యాహ్న భోజనం పిల్లలకి కాదు, భోక్తలకి

– చిన్న పిల్లల ‘మధ్యాహ్న భోజన పధకం‘ కూడా అవినీతి పరుల బొజ్జలు, భోషాణాలు నింపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ దారుణం జరుగుతోంది. అనేక సంవత్సరాలుగా ఢిల్లీలోని బడి పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం అత్యంత అనారోగ్యకరంగా ఉంటోందని ప్రయోగ శాలల పరీక్షలు తేల్చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సేకరించిన మధ్యాహ్న భోజన శాంపిళ్లలో 83 శాతం ప్రయోగశాలల పరీక్షల్లో విఫలం అయ్యాయని ఆర్.టి.ఐ (Right to Information) చట్టం…