అబ్రహాం ఎకార్డ్స్: పశ్చిమాసియాలో నూతన భాగస్వామ్యాలకు తెరతీసిన అమెరికా -2
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిధ్యంలో సెప్టెంబర్ 15, 2020 తేదీన నూతన అరబ్-యూదు శాంతి ఒప్పందానికి వైట్ హౌస్ వేదిక అయింది. అరబ్బు దేశాలు యూఏఈ, బహ్రయిన్ లు యూదు దేశం ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ‘అబ్రహాం ఎకార్డ్స్’ పేరుతో పిలవబడుతోంది. ఇది దాదాపు 26 సంవత్సరాల తర్వాత కుదిరిన మొట్టమొదటి అరబ్-యూదు శాంతి ఒప్పందం. ఇది ఎకార్డ్ (అంగీకారం), అగ్రిమెంట్ (ఒప్పందం) కాదు. దీని ప్రకారం యూఏఈ,…