లిబియా: రష్యా, వెస్ట్ మధ్య రాజుకుంటున్న నిప్పు
బ్రిటిష్ రక్షణ మంత్రి మైఖేల్ ఫాలన్ రెండు రోజుల క్రితం రష్యాకు వ్యతిరేకంగా ఓ వ్యాఖ్య చేశారు. ఆ వెంటనే రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తన సొంత వ్యాఖ్యతో చాచి కొట్టినట్లు బదులిచ్చారు. ఇది కేవలం వాగ్వివాదమే అయినా మధ్య ప్రాచ్యంలో రష్యా, పశ్చిమ దేశాల మధ్య మరో ఘర్షణ కేంద్రం అభివృద్ధి చెందుతున్న పరిస్ధితికి ప్రబల సూచిక! వారి వివాదం లోని అంశం లిబియా. లిబియాలో ప్రభావ విస్తరణకు రష్యా ప్రయత్నాలు చేయడం…