ముస్లిం హిందువులు మళ్ళీ ముస్లిం మతం లోకి…

సంఘ పరివార్ గణాలు ఆగ్రాలో అట్టహాసంగా నిర్వహించిన ముస్లిం మత మార్పిడి మూన్నాళ్ల ముచ్చటగా ముగిసింది. భూములు ఇస్తామని మాయ మాటలు చెప్పి ముస్లిం మతం నుండి కొందరిని హిందు మతంలోకి మార్చినట్లు తతంగం నడిపారని మోసం గ్రహించి తిరిగి ముస్లిం మతంలోకి వచ్చామని సదరు ముస్లింలు చెప్పడం విశేషం. ఆగ్రాలోని నాట్ కమ్యూనిటీకి చెందిన ముస్లింలు అత్యంత పేదవారు. వారికి తమది అని చెప్పుకునే ఆస్తులు దాదాపు లేవు. ప్రభుత్వానికి చెందిన వృధా భూముల్లోనే తాత్కాలిక…

మోడి మార్కు లక్ష్మణ రేఖ -కార్టూన్

ప్రధాని నరేంద్ర మోడి తన లక్ష్మణ రేఖ ప్రకటించారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘రామ్ జాదే – హరామ్ జాదే’ అంటూ చేసిన ప్రసంగం ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడంతో ఆయన ‘కొత్త మంత్రులు, పార్టీ నేతలు’ ‘నియంత్రణ’లో ఉండాలని లక్ష్మణ రేఖ గీశారు. ఇంత గొడవ జరుగుతుంటే ప్రధాని ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు గర్జించడంతో పార్లమెంటుకు వచ్చిన ప్రధాని ‘కొత్త మంత్రి, గ్రామీణ నేపధ్యం, అంతా కొత్త. అయినా ఆపాలజీ…

కొలువిస్తామని మత మార్పిడి, హిందూ సంస్ధల ‘ఏ’కృత్యం?

హిందువులు ముస్లిం మతంలోకి మారినా, బాప్తిజం పుచ్చుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళినా ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ‘లవ్ జిహాద్’ అంటూ స్వకపోల కల్పిత కుట్రలను కూడా సృష్టించి కులాతీత, మతాతీత ప్రేమ వివాహాలకు మతం రంగు పులమడం వారికి ఇష్టమైన కార్యక్రమం. అలాంటి హిందూ అతివాద సంస్ధలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రభుత్వ పధకాలు ఇప్పిస్తాం, అని ఆశ చూపుతూ ముస్లింలను హిందూ మతంలోకి…

అక్కడ హిందువులు, ఇక్కడ ముస్లింలు: మైనారిటీలకు ఎక్కడా రక్షణ లేదు

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియాలో అయినా, మిలట్రీ కనుసన్నల్లో ఎదుగుతున్నపాకిస్ధాన్ నామమాత్ర ప్రజాస్వామ్యంలో అయినా మైనారిటీలకు  ఎక్కడా రక్షణ లేదు. మైనారిటీ మతస్ధుల ఆస్తులు లాక్కోవడానికి మతం అడ్డు పెట్టుకునే దుర్మార్గాలు రెండు చోట్లా కొనసాగుతున్నాయని పత్రికల ద్వారా తెలుస్తున్నది. ‘రింకిల్ కుమారి’ కేసు ద్వారా పాక్ సుప్రీం కోర్టు కూడా మత ఛాందస శక్తుల ముసుగులో దాక్కున్న భూస్వామ్య పాలకవర్గాల చేతిలో బందీ అని స్పష్టం అయింది. ఫలితంగా తమ ఆస్తులను భక్షించడానికి జరుగుతున్న…