ఇరోం షర్మిల తదుపరి నిశ్చయం -ద హిందూ ఎడిట్.. 

(True translation to today’s The Hindu editorial “Irom Sharmila’s next stand”) ********** ఇరోం చాను షర్మిల, తన నిరాహార దీక్షను ఆగస్టు 9 తేదీన విరమిస్తానని చేసిన ప్రకటన దాదాపు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వాలు చట్టబద్ధమైన, గందరగోళపరిచే AFSPA మాటున ఆత్మరక్షణ పొందగా, ఆమె చేపట్టిన శక్తివంతమైన శాంతియుత ప్రతిఘటనా చర్య ఆ రక్షణను బలహీనం కావించింది. తద్వారా ప్రజాస్వామ్యం పైనా మానవత్వం పైనా అది కలుగజేస్తున్న క్షయీకరణ ప్రభావాన్ని బట్టబయలు…

ఏ‌ఎఫ్‌ఎస్‌పి‌ఏ కింద శిక్షలేమికి ముగింపు -ద హిందూ ఎడిట్..

[Ending impunity under AFSPA శీర్షికన ఈ రోజు -11/07/2016- ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] “జవాబుదారితనం, చట్టబద్ధ సూత్రాలకు ఒక పార్శ్వం.” విధి నిర్వహణ పేరుతో  “కల్లోలిత ప్రాంతాలలో” కూడా, భద్రతా బలగాలు పాల్పడే అతి చర్యలపై జరగవలసిన దర్యాప్తు నుండి తప్పించుకోజాలరని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగు దరిమిలా ఈ స్థాపిత సూత్రం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి నోటిఫైడ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ “ప్రత్యేక అధికారాలు” ఉపయోగించినప్పుడు చట్టబద్ధ…

మనోరమ: చిత్రహింసలు పెట్టి చంపేశారు -కమిషన్

మణిపురి యువతి తంగ్జామ్ మనోరమ హత్యకు ఎవరు బాధ్యులో విచారించిన జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఎట్టకేలకు వెలుగు చూసింది. నివేదికను కమిషన్ వెల్లడి చేసిన దశాబ్దం తర్వాత, అది కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నాకనే, అందులోని అంశాలు పాక్షికంగానైనా లోకానికి వెల్లడి అయ్యాయి. అస్సాం రైఫిల్స్ కు చెందిన సైనిక బృందం ఒకటి మనోరమ ఇంట్లో చొరబడి, ఆమెను లాక్కెళ్లి, చిత్రహింసలకు గురిచేసి, అనంతరం విచక్షణారహితంగా అనేకమార్లు తుపాకితో కాల్చి చంపారని కమిషన్ నివేదిక తెలిపింది.…

అలజడి, ఆందోళనల నేపధ్యం ఏమిటి? -ఈనాడు ఆర్టికల్ 8వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాసాల పరంపరలో ఎనిమిదవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలకు, మిలిటెన్సీకి నేపధ్యాన్ని ఈ భాగం క్లుప్తంగా చర్చించింది. ఈ చర్చాంశాల ఆధారంగా అక్కడి పరిణామాలను పరిశీలిస్తే ఒక అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో చదవాలనుకుంటే కింద బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఓపెన్…

మణిపూర్ ఎన్ కౌంటర్లు బూటకం, సుప్రీం కోర్టు కమిటీ నిర్ధారణ

మణిపూర్ లో భారత సైనికులు పాల్పడిన ఆరు ఎన్ కౌంటర్లు బూటకం అని సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. 12 సంవత్సరాల బాలుడితో సహా ఎన్ కౌటర్ లో మరణించినవారందరికీ ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని కమిటీ తేల్చి చెప్పింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ లతో కూడిన డివిజన్ బెంచి కమిటీ నివేదికను పరిశీలించింది. కమిటీ ఆరు ఎన్ కౌంటర్ కేసులను విచారించగా, ఆరు కేసులూ…

యాక్సిడెంట్ బాధిత ఈశాన్య మహిళపై చేయి చేసుకున్న వీర పోలీసు

టూ వీలర్ తో కారుని గుద్దిన వ్యక్తిని వదిలి కారు నడుపుతున్న మణిపురి మహిళ (పేరు: Swar Thounaojam) పై చేయిచేసుకున్న వీర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదంతం ఇది. ప్రమాదం చేసిన వ్యక్తిని వదిలిపెట్టి మొదటి తప్పు చేసిన కానిస్టేబుల్ మహిళపై చేయిచేసుకుని మరో నేరానికి పాల్పడ్డాడు. ప్రమాదస్ధలి వద్ద గుమికూడిన జనం కూడా మహిళనే తిట్టి, కొట్టినంతపనిచేసి, అసభ్యంగా తాకరానిచోట్ల తాకి భారత సమాజ నాగరికత యొక్క సగటు సభ్యత పాతాళస్ధాయిలోనే కునుకు తీస్తోందని చాటుకున్నారు.…

మణిపూర్ ఇండియా వలసలా ఉంది తప్ప రాష్ట్రంలా లేదు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్ రాష్ట్రం ఇండియాలో భాగమైన ఒక రాష్ట్రం కంటే ఇండియా ఆక్రమించుకున్న ఒక వలస ప్రాంతం వలె ఉందని మణిపూర్ సందర్శించిన తర్వాత అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో రాశాడు. మిలట్రీ, పారా మిలట్రీ, పోలీసులు అడుగుడునా ఉన్న మణిపూర్ ని చూసి అది ఇండియా ఆక్రమణలో ఉన్న భావన కలిగిందని రాయబారి రాశాడు. 2006 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాక కోల్ కతా లోని అమెరికా…