అమెరికా: మంచు తుఫాను అంటే 100 అంగుళాలా! -ఫోటోలు

అమెరికా ఈశాన్య రాష్ట్రాలను వణికించిన హిమపాతం -బ్లిజ్జర్డ్- గురించి రెండు వారాల క్రితం తెలుసుకున్నాం. నిజానికి ఒక్క బ్లిజ్జర్డ్ మాత్రమే కాదు. గత కొద్ది వారాలుగా ఆ ప్రాంతాన్ని వరుస మంచు తుఫాన్లు చుట్టుముట్టి మోదుతున్నాయి. ఈ తుఫాన్ల తీవ్రత ఎంత అధికంగా ఉన్నదంటే గత నెల రోజులలో అక్కడ 100 అంగుళాల మంచు కురిసింది. మరీ ముఖ్యంగా న్యూ ఇంగ్లండ్ గా పిలిచే 6 ఈశాన్య రాష్ట్రాలు (కనెక్టికట్, మైన్, మసాచూసెట్స్, న్యూ హ్యాంప్ షైర్,…

ఐరోపా మంచు తుఫాను: పైన్ చెట్లా? హిమ శిల్పాలా? -ఫోటోలు

ప్రాకృతిక వింతలను రికార్డు చేయడం మొదలు పెట్టాలే గానీ దానికిక అంతూ పొంతూ అంటూ ఉండదు. అదొక మహా యజ్ఞం అనడం సబబుగా ఉంటుంది. కాదంటే రెండు రోజుల పాటు కురిసిన మంచు తుఫాను తూర్పు యూరప్ దేశాలలోని ఆల్ప్స్ పర్వత శ్రేణిపై విస్తరించిన అటవీ వృక్షాలను, ఇతర నిర్మాణాలను హిమనీ శిల్పాలుగా మార్చివేయడం గురించి ఎలా చెప్పగలం? ఐరోపాలోని పలు దేశాలను తీవ్ర వాతావరణ పరిస్ధితులు చుట్టు ముట్టాయి. ఎముకలు కొరికేసే చలి వాతావరణం జనజీవనాన్ని…

అమెరికాలో మళ్ళీ మంచు తుఫాను, ఈసారి దక్షిణాన -ఫోటోలు

జనవరి చివరిలో అమెరికాను మరోసారి మంచు తుఫాను వణికించింది. పోలార్ వొర్టెక్స్ ఫలితంగా జనవరి మొదటివారంలో మధ్య పశ్చిమ, ఈశాన్య అమెరికాలు గజగజ వణికిపోగా ఈసారి చలికాలంలో సంభవించే మంచు తుఫాను అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా అలబామా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాలను చలి పులి చుట్టుముట్టింది. ఈశాన్య అమెరికా నుండి కరోలినా, జార్జియాల మీదుగా టెక్సాస్ వరకూ విస్తరించి ఉన్న మంచు దుప్పటిని కింది ఫొటోల్లోని శాటిలైట్ చిత్రంలో చూడవచ్చు. మంచు తుఫాను దాటికి…

కాశ్మీర్ లో 130 మంది పాక్ సైనికులు ‘మంచులో సమాధి’

కాశ్మీర్ మంచు పర్వతాలలో 130 మంది పాక్ సైనికులు మంచులో సమాధి అయ్యారు. మంచు తుఫానులో వేగంగా కిందికి జారుతున్న భారీ మంచు గడ్డ కింద చిక్కుకుపోయి చనిపోయారు. 130 మంది కంటే ఎక్కువ సంఖ్యలోనే సైనికులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అతి పెద్ద హిమాలయ పర్వతాలపైన గల సియాచిన్ గ్లేసియర్ పైన భారత సరిహద్దుకి సమీపంలో ఉన్న పాకిస్ధానీ ఆర్మీ శిబిరంపైకి మంచు గడ్డ దూసుకు రావడంతో తప్పించుకునే అవకాశం లభించలేదని తెలుస్తోంది. సియాచిన్ గ్లేసియర్…