మంగుళూరు దాడి నాయకుడు నరేంద్ర మోడీకి పరమ భక్తుడు

మంగుళూరులో ‘హిందూ సంస్కృతి’ పరిరక్షణ కోసం అంటూ బర్త్ డే పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకులపై నీచమైన రీతిలో దాడి చేసిన మూకలకు నాయకత్వం వహించిన సుభాష్ పాడిల్ గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి కి పరమ భక్తుడని ‘ది హిందూ’ వెల్లడించింది. 2009 లో పబ్ పై దాడి చేసి అమ్మాయిలపై చేయి చేసుకున్న బృందంలో కూడా సుభాష్ పాడిల్ చురుకయిన సభ్యుడని తెలిపింది. 2009 దాడిలో టి.వి చానెళ్ళు, పత్రికల ద్వారా బహుళ…

హిందూ పరిరక్షకుల చేతిలో మానవీయ సంస్కృతి విధ్వంసం -ఫొటోలు

“దాడి చేసినవారిలో ఒకడు ఆకలిగొన్న కుక్కలా నా స్నేహితురాలి శరీరం అంతా తాకాడు. ఆటవస్తువులా ఆడుకున్నాడు. నేను వివరించలేను… వాడి అసలు ఉద్దేశ్యం ఏమిటో మీరే అర్ధం చేసుకోవాలి.” మంగుళూరులో హిందూ సంస్కృతి పరిరక్షకులమంటూ పెచ్చరిల్లిన మూకల దాడిలో బాధితురాలు సిగ్గుతో చస్తూ చెప్పిన నాలుగు మాటలివి. “అది రేవ్ పార్టీ కాదు. మేమలాంటివారం కాదు. మా ఫ్రెండ్ తన పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంది. ఆడపిల్లల్ని ఇలాగేనా చూసేది? మంగుళూరులో నేనిక ఏ పార్టీకీ వెళ్లను… మా…

‘బర్త్ డే పార్టీ’ లపై హిందూ సంస్కృతి పరిరక్షకుల అసభ్య దాడి, అరెస్టులు

హిందూ సంస్కృతిని పరిరక్షిస్తామంటూ బయలుదేరిన గుంపు కర్ణాటక లోని మంగుళూరులో మరోసారి వీరంగం ఆడింది. పుట్టిన రోజు పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకుల బృందం పై ‘హిందూ జాగరణ వేదిక’ కు చెందిన మూకలు దాడి చేసి విచక్షణారహితంగా చావబాదారు. పుట్టిన రోజు పార్టీ అని చెబుతున్నప్పటికీ వినకుండా మృగాల్లా ప్రవర్తించారు. అమ్మాయిలను తాకకూడని చోట తాకుతూ, జుట్టు పట్టి లాగుతూ, కొడుతూ నీచంగా ప్రవర్తించారు. హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా…