భోపాల్: వేల ప్రాణాలకు గడ్డిపోచ విలువ కట్టి 30 యేళ్ళు -ఫోటోలు

విషపు రెక్కల డేగ భోపాల్ నగరం విను వీధుల్లో విష విహారం చేసి డిసెంబర్ 3 తేదీకి 30 యేళ్ళు గడిచిపోయాయి. సో కాల్డ్ నాగరిక ప్రజాతంత్ర భారత రిపబ్లిక్ రాజ్యం సాక్షిగా, ఘనతర ఆధునిక న్యాయ వ్యవస్ధల కనుసన్నల్లో, సామ్రాజ్యవాద అమెరికాతో స్నేహ సంబంధాలు దినదిన ప్రవర్ధమానం అవుతుండగానే భోపాల్ విష వాయు బాధితులు నేటికీ విషవాయువు పీడితులుగా ఇళ్ళు, ఒళ్ళు, తరతరాల ఆరోగ్యం అన్నీ గుల్ల చేసుకుని న్యాయం కోసం దేబిరిస్తూనే ఉన్నారు. రారాజులు,…

టెక్సాస్: భూకంపం తలపిస్తూ ఎరువుల ఫ్యాక్టరీ పేలుడు, మరణాలు 70? -ఫోటోలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వాకో నగరం వద్ద ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ భారీ స్ధాయిలో పేలిపోయింది. 5 నుండి 15 మంది వరకు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా పత్రికలు డజన్ల మంది మరణించి ఉండవచ్చని భావిస్తున్నాయి. 70 మందికి పైనే మరణించారని స్ధానిక పత్రికలు చెప్పినట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారని బి.బి.సి తెలిపింది. ఎరువుల ఫ్యాక్టరీ కావడంతో మంటల వలన వ్యాపిస్తున్న దట్టమైన పొగ విషపూరితంగా ఉన్నదని, దానితో వివిధ విభాగాల భద్రతా…

క్లుప్తంగా…. 30.04.2012

జాతీయం లండన్ ఒలింపిక్స్ ని ఇండియా బహిష్కరించాలి -భోపాల్ బాధితుడు “డౌ కెమికల్స్” కంపెనీ సొమ్ముతో జరుగుతున్న లండన్ ఒలింపిక్స్ ను ఇండియా అధికారికంగా బహిష్కరించాలని భోపాల్ గ్యాస్ లీక్ బాధితుడు సంజయ్ వర్మ డిమాండ్ చేశాడు. గ్యాస్ లీక్ ప్రమాదానికి ఐదు నెలల ముందు జన్మించిన సంజయ్ గ్యాస్ దుర్ఘటన వల్ల అనాధగా మారాడని ‘ది హిందూ’ తెలిపింది. డౌ కంపెనీ చేతులకు భోపాల్ బాధితుల రక్తం అంటిందని, ఆ రక్తం ఇపుడు లండన్ పయనమైందని…

‘భోపాల్ గ్యాస్ లీక్’ ఉద్యమం పై నిఘా పెట్టిన ‘డౌ కెమికల్స్’

భోపాల్ గ్యాస్ లీక్ బాధితులకు నష్ట పరిహారం కోసం పోరాడుతున్న సంస్ధలపైన అమెరికా కంపెనీ ‘డౌ కెమికల్స్’ అనేక సంవత్సరాలుగా నిఘా పెట్టిన సంగతి వెల్లడయ్యింది. అమెరికాలో టెక్సాస్ లో ఉన్న ‘స్ట్రాట్ ఫర్’ అనే ప్రవేటు డిటెక్టివ్ కంపెనీని ఇందుకు వినియోగించినట్లుగా వెల్లడ్యింది. ప్రవేటు డిటెక్టివ్ కంపెనీ ‘స్ట్రాట్ ఫర్’ కి సంబంధించిన 5.5 మిలియన్ల (55 లక్షలు) ఈ మెయిళ్ళు వికీ లీక్స్ కు అందడంతో స్ట్రాస్ ఫర్ పాల్పడిన పాపాల పుట్ట బద్దలయింది.…

భోపాల్ గ్యాస్ లీక్ బాధితులపై పోలీసుల లాఠీ ఛార్జి

ఇరవై ఏడేళ్ల క్రితం జరిగిన భోపాల్ విష వాయువు లీక్ దుర్ఘటనకు సంబంధించిన బాధితులకు పూర్తి న్యాయం చేకూరాలని కోరుతూ దుర్ఘటన దినం డిసెంబరు 3 తేదీన బాధితులు చేసిన ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు. బాధితులకు న్యాయమైతే దక్కలేదు గానీ తమకు దక్కని న్యాయం కోసం ఆందోళన చేసే హక్కును కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దారుణమంటూ సంఘటనను అనేకమంది ఖండించారు. 1984 డిసెంబరు 3 తేదీన భోపాల్ నగరంలో ఉన్న యూనియన్ కార్భైడ్ పురుగు మందుల ఫ్యాక్టరీ…