పనికి(మాలిన)రాని కీచులాట! -కార్టూన్
రైతుల సమస్యల పట్ల పాలక, ప్రతిపక్ష పార్టీలు ఇరువురికీ చిత్తశుద్ధి కొరవడిందని శక్తివంతంగా చెబుతున్న కార్టూన్ ఇది. రాహుల్ గాంధీ తన పునరాగమనానికి భూసేకరణ చట్టం – 2013 కు మోడీ ప్రభుత్వం తెస్తున్న సవరణలను ఆలంబనగా చేసుకున్నారు. తాము రైతులకు అనుకూలమైన చట్టం తెస్తే మోడి దానికి చిల్లులు పొడుస్తున్నారని ఆయన ఆక్రందన! విచిత్రంగా బి.జె.పి, మోడిలు సైతం తమ సవరణలు రైతుల కోసమే అని చెబుతున్నారు. కొంతమంది పనిగట్టుకుని తమ సవరణలపై దుష్ప్రచారం చేస్తున్నారని…