వాలుకి విరుద్ధంగా… -ది హిందు ఎడిట్..

[జూన్ 4 నాటి ది హిందు ఎడిటోరియల్ ‘Against the grain’ కు ఇది యధాతధ అనువాదం. ఈ శీర్షిక ఆంగ్లంలో ఒక సామెత. కట్టెను వాలుగా కొస్తే త్వరగా తెగుతుంది తప్ప అడ్డంగా కోస్తే అనుకున్న ఫలితం రాదని ఈ సామెత సూచిస్తుంది. ఈ సామెత ప్రస్తావించడంలోనే ది హిందు ఉద్దేశ్యం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కానీ ఎడిటోరియల్ లో గమనార్హమైన పరిశీలనలు ఉన్నాయి.] ***************** “న్యాయమైన నష్టపరిహారం పొందే హక్కు మరియు భూ సేకరణ, పునరావాసం,…

పనికి(మాలిన)రాని కీచులాట! -కార్టూన్

రైతుల సమస్యల పట్ల పాలక, ప్రతిపక్ష పార్టీలు ఇరువురికీ చిత్తశుద్ధి కొరవడిందని శక్తివంతంగా చెబుతున్న కార్టూన్ ఇది. రాహుల్ గాంధీ తన పునరాగమనానికి భూసేకరణ చట్టం – 2013 కు మోడీ ప్రభుత్వం తెస్తున్న సవరణలను ఆలంబనగా చేసుకున్నారు. తాము రైతులకు అనుకూలమైన చట్టం తెస్తే మోడి దానికి చిల్లులు పొడుస్తున్నారని ఆయన ఆక్రందన! విచిత్రంగా బి.జె.పి, మోడిలు సైతం తమ సవరణలు రైతుల కోసమే అని చెబుతున్నారు. కొంతమంది పనిగట్టుకుని తమ సవరణలపై దుష్ప్రచారం చేస్తున్నారని…

రైతుల భూములపై రాహుల్ కి అంత ప్రేమ ఏల? -కార్టూన్

రాహుల్ గాంధీ సెలవు కాలం ముగించుకుని కలుగులోంచి వెలికి వచ్చారు. వచ్చీ రావడంతోనే రైతుల (కోసం) ర్యాలీ నిర్వహించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు (లేదా చాటానని ఆయన అనుకున్నారు). ఆయన మాట్లాడినంత సేపూ జనం (ఎలాగో) ఉన్నారని, ఆయన ముగించి సోనియా గాంధీ మాట్లాడడం ప్రారంభించగానే జనం వెళ్లిపోవడం మొదలు పెట్టారని పత్రికలు గుస గుస రాశాయి. పునరాగమనం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి తెచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై ఆయన నిప్పులు…