రైతులకు ఉరి బిగించే అభివృద్ధి -కార్టూన్

అభివృద్ధి పేరుతో భారత పాలకులు రైతుల మనుగడను ఏ స్ధాయిలో ప్రశ్నార్ధకం చేస్తున్నారో పట్టిస్తున్న కార్టూన్ ఇది! పాలకులు నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తారు గానీ ఆ అభివృద్ధి ఎవరికి చెందినదో ఎప్పుడూ చెప్పరు. అసలు 66 యేళ్ళ స్వతంత్రావనిలో అభివృద్ధి లేకుండా ఎలా పోయిందో మొదట వారు చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వారు పార్టీల మధ్య తగాదా స్ధాయికి కుదించి జనాన్ని కూడా అదే నమ్మమంటారు. పాలకవర్గ పార్టీలన్నింటి వెనుకా ఉన్నది ఒకే దోపిడీ…

ఇదీ మోడీ వ్యవసాయ మద్దతు! -కార్టూన్

“నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం” అనే సామెత వింటుంటాం. భారత రైతుల పట్ల ప్రధాని మోడి వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. “వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని ఆపలేమా?” అని ఆయన బహిరంగ సభల్లో ప్రశ్నిస్తారు. ఆత్మహత్యలు ఆపండి మహా ప్రభో అని ఆయనని అందలం ఎక్కిస్తే, ఆ అందలం మీద కూర్చొని ఆత్మహత్యల్ని ఆపలేమా అని తిరిగి జనాన్ని ప్రశ్నించడం ఏమిటి, జనాన్ని వెక్కిరించడం కాకపోతే! నిన్నో మొన్నో ఆయన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు.…

ఆంధ్ర రాజధాని: భూ స్వాధీనానికి రైతులు వ్యతిరేకం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొంతు రోజు రోజుకి కఠినంగా మారుతోంది. రైతులకు బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చి భూములు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు “భూములు ఇచ్చారా సరే సరి, లేదా…” అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల అభివృద్ధిలో రైతులకు వాటా ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ వైపు మొగ్గు ప్రకటిస్తున్నారు. పూలింగ్ కు ఒప్పుకోకపోతే స్వాధీనం చేసేసుకుంటాం అని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి…