భీమా బిల్లు: అక్కరకు రాని మోడి మెజారిటీ -కార్టూన్

స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలతో, వ్యాపార వర్గాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తామని మోడి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సదరు హామీని మొదటి అడుగులోనే హుళక్కి చేయడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సఫలం అయింది. పాతికేళ్లలో మొదటిసారిగా పూర్తి మెజారిటీ సంపాదించినా అది ఎన్నికల హామీలకు అక్కరకు రాకుండా పోయింది. పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండింటికీ ఉపయోగపడే జ్యుడీషియల్ కమిషన్ బిల్లును రెండు సభల్లో ఆమోదింపజేసుకున్నప్పటికీ భీమా ఎఫ్.డి.ఐ పరిమితి పెంపు బిల్లును మాత్రం గట్టెక్కించలేకపోయింది. నిజానికి భీమా ఎఫ్.డి.ఐ…