ఫాసిజం: జే‌ఎన్‌యూ విద్యార్ధి నేత అరెస్ట్

హిందూత్వ ఫాసిజం తన ఫాసిస్టు ప్రయాణంలో మరో అడుగు వేసింది. ఈసారి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పంజా విసిరింది. విద్యార్ధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అపహాస్యం చేస్తూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హైయా కుమార్ పైకి ఢిల్లీ పోలీసులను ఉసి గొల్పింది. యూనివర్సిటీ విద్యార్ధులపై కఠిన చర్య తీసుకోవాలని తానే ఆదేశించానని కేంద్ర హోమ్ మంత్రి సగర్వంగా చాటుకున్నారు. యూనివర్సిటీ విద్యార్ధులు ‘జాతీయ-వ్యతిరేక’ భావోద్వేగాలు వ్యక్తం చేశారని కేంద్ర హోమ్ మంత్రి ఎకాఎకిన నిర్ధారించేశారు.…

భావ ప్రకటన స్వేచ్ఛ: క్యూబాకి ఒకటి, అమెరికాకి మరొకటి -కార్టూన్

‘యోవాని సాంఛేజ్’ పశ్చిమ దేశాలకు మహా ఇష్టురాలు. క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి ప్రకటించడం దానికి కారణం. ఆమె ఈ మధ్య ప్రపంచ పర్యటనకి బయలుదేరింది. క్యూబాలో జనం ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవిడ ప్రచారం చేస్తోంది. యోవాని అసమ్మతిని క్యూబా ప్రభుత్వం సహించలేకపోతోందని, ఆమె భావ ప్రకటనా స్వేచ్చని హరిస్తోందని అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు మొత్తుకుంటాయి.  ఆమె అసమ్మతి సహజంగానే పశ్చిమ కార్పొరేట్ పత్రికలలో ప్రముఖ స్ధానం పొందుతోంది. యోవాని భావ ప్రకటన స్వేచ్చ…

పాఠ్య గ్రంధాల్లో 200 కార్టూన్ల సమీక్షకు నిర్ణయం

ఎన్.సి.ఇ.ఆర్.టి (National Council of Educational Research and Training) రూపొందించిన పాఠ్య గ్రంధాల్లో ఉన్న కార్టూన్లు అన్నింటినీ సమీక్షించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్, నెహ్రూ లతో ఉన్న కార్టూన్ పై చెలరేగిన అనవసర వివాదం స్కూల్ పిల్లలకు వివిధ అంశాలపై సాపేక్షికంగా తేలిక పద్ధతిలో అవగాహన కల్పించే ఒక బోధనా పద్ధతి ని దెబ్బ కొట్టింది. కార్టూన్ల ద్వారా వివిధ రాజకీయ శాస్త్రాంశాలను బోధించే పద్ధతి స్కూల్ పాఠ్య గ్రంధాల నుండి మాయం…

తననూ వదలొద్దని కోరిన నెహ్రూ -కార్టూన్

ప్రజాస్వామిక వ్యవస్ధకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పత్రికలను అభివర్ణించడం అందరూ ఎరిగిందే. కార్టూన్ ద్వారా రాజకీయ విమర్శలు చేయడం అత్యంత శక్తివంతమైన ప్రక్రియగా పత్రికలు అభివృద్ధి చేశాయి. కాసిన్ని గీతల ద్వారా ప్రకటించే రాజకీయ అభిప్రాయాలని నిషేధించాలని కోరడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్ధలో అత్యంత ముఖ్యమైన ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కు సంకెళ్లు వేయాలని కోరడమే. అందుకే ప్రజాస్వామ్య ప్రియులైన రాజకీయ నాయకులు తమను తాము విమర్శలకు అతీతులుగా ఎన్నడూ పరిగణించరు. భారత దేశ ప్రధమ ప్రధాని ‘జవహర్…