వడ్డీ ఋణ భారం, వాణిజ్యీకరణ -13

(12వ భాగం తరువాయి……………..) భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్  :  పార్ట్ 13 వ్యవసాయ రుణం, వడ్డీ చెల్లింపులు, వాణిజ్యీకరణ రుణాలు, వడ్డీల వాస్తవ పరిమాణం రైతుల స్ధితి గతులను ఋణ భారం, వడ్డీ చెల్లింపుల భారీతనం కూడా వెల్లడి చేస్తుంది. SASF గణాంకాల ప్రకారం రైతు కుటుంబాల్లో 49 శాతం ఋణ పీడితులు. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరీ అధికం. ఉదాహరణకి ఆంధ్ర ప్రదేశ్ రైతు కుటుంబాల్లో 82 శాతం ఋణ భారం మోస్తున్నారు.…

భారత వ్యవసాయం మిగులు ఎవరి సొంతం! -12

(11వ భాగం తరువాత………) భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 12 – వ్యవసాయ రాబడిలో మిగులు స్వాధీనం చేసుకునే సెక్షన్ రైతు కుటుంబాల్లో వినియోగ ఖర్చులకు పోను మిగులు సాధించే సెక్షన్ సంగతి చూద్దాం. పెద్ద సైజు కమతాల రైతుల నుండి అతి పెద్ద సైజు కమతాల భూస్వాముల వరకు వ్యవసాయంలో మిగులు సాధిస్తున్నారు. అనగా 10 హెక్టార్లు (25 ఎకరాలు) అంతకు మించి కమతాల రైతులు నికరంగా మిగులు సాధిస్తున్నారు. అయితే 10…

భూ సంస్కరణలు – జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధి

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ పార్ట్ – 7 (భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా. అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది 7 వ భాగం. మొదటి 6 భాగాల కోసం ఈ భాగం చివర ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు. -విశేఖర్) *********            నెపోలియన్ III యొక్క (జపాన్ కి కేటాయించబడిన) మంత్రి తోకుగావా బకుఫుతో ఫ్రెంచి అలయన్స్ కోసం ప్రయత్నించగా…

మీజీ పునరుద్ధరణ: జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధికి నాంది

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ –పార్ట్ 6 (భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా. అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది ఆరవ భాగం. మొదటి 5 భాగాల కోసం ఈ భాగం చివర ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు. -విశేఖర్) చాప్టర్ III మీజీ పునరుద్ధరణ మరియు జపాన్ పెట్టుబడిదారీ మార్గం      1850ల వరకూ జపాన్ రాజకీయంగా మూసివేయబడ్డ సమాజం. యూరప్ లో…

బ్రిటిష్ ఇండియా ఆదాయం రెండొంతులు దోపిడికే

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ – పార్ట్ 5 – గ్రామీణ సమాజంలో పై పొరలో ఉన్నవారు తమ యాజమాన్యంలో ఉన్న భూములను, శ్రమ సాధనాలను గ్రామాల్లోని భూమిలేని పేదల శ్రమశక్తితో కలిపి ఉత్పత్తి తీస్తున్నారనేది నిజమే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛా శ్రమ శక్తితో కూడిన స్ధానిక మార్కెట్లు రూపొందుతున్నాయని చెప్పేందుకు ఆధారం లేదు. కూలీలకు సాంప్రదాయ రేట్ల ప్రకారమే వస్తు రూపేణా కూడా కూలి చెల్లిస్తున్నారు. గ్రామీణ భారతంలో ఆర్ధిక-పారిశ్రామికవేత్త…

పెట్టుబడిదారీ పూర్వ ఉత్పత్తి విధానాలు – భారత దేశం

(భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా.అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది నాలుగవ భాగం. మొదటి మూడు భాగాల కోసం కింది లింకులను చూడగలరు. -విశేఖర్) భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు వ్యవసాయ సమస్యపై కారల్ కాట్ స్కీ, లెనిన్ భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 4 చాప్టర్ II పెట్టుబడిదారీ పూర్వ…

వ్యవసాయ సమస్యపై కారల్ కాట్ స్కీ, లెనిన్

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -పార్ట్ 3 వ్యవసాయ సమస్య – కారల్ కాట్ స్కీ           పెట్టుబడిదారీ విధానం, వ్యవసాయ మార్పులను సంబంధించి అధ్యయనం చేయడానికి ఈ రచనను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంది.           రైతాంగం మరియు పెట్టుబడిదారీ విధానం (Peasantry &Capitalism), ఆంగ్ల ఎడిషన్ ను పరిచయం చేస్తూ హంజా ఆలావి, ధియోడర్ షనిన్ లు లెనిన్ ను ఇలా ఉటంకించారు:           “కేపిటల్ మూడో వాల్యూమ్ తర్వాత నుండి ప్రస్తుత ఆర్ధిక…

పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -ఒక నోట్ -పార్ట్ 2       పంపిణీలు & ఉత్పత్తి (Distributions & Production): భూమి అద్దె, వేతనాలు, వడ్డీ మరియు లాభ మొత్తం లను పంపిణీ కిందా, భూమి, శ్రమ మరియు పెట్టుబడి మొత్తం లను ఉత్పత్తి కిందా మార్క్స్ చర్చించారు. “పంపిణీ రూపాలలో ఉండే వడ్డీ మరియు లాభాలు ‘పెట్టుబడి, ఉత్పత్తి యొక్క ప్రతినిధి (agent of production)’ అనే పూర్వాలోచన (presupposes) కలిగి ఉంటాయి” అని కూడా…

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్

(భారత దేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల స్వభావం ఏమిటన్నదీ దేశంలో ఒక చర్చగా ఉంటోంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలలో, ఇంకా ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలలో ఈ అంశం పైన తీవ్రమైన చర్చోపచర్చలు నడుస్తున్నాయి. భారత దేశ వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం (Capitalist Mode of Production) ప్రవేశించిందని కొంత మంది వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను తిరస్కరిస్తున్నారు. అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధగా నిర్వచించబడిన భారత దేశ సామజిక వ్యవస్ధ…