వాజ్ పేయికి భారత రత్న సుపరిపాలనేనా? -కార్టూన్

“అయితే, మోడీజీ – మీ సుపరిపాలన బాగా సాగుతున్నట్లేనా?” ********* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కి మోడి ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఆయనతో పాటు హిందూ మహా సభ నాయకుడు మదన్ మోహన్ మాలవీయకు కూడా, ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెబుతూ ‘భారత రత్న’ ప్రకటించారు. (మాలవీయ 4 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా పని చేయడం విశేషం.) మాలవీయకు భారత రత్న ప్రకటించడం అనవసరం అనీ,…

పోల్: భారత రత్నకు సచిన్ అర్హుడేనా?

సచిన్ టెండూల్కర్ ఒక క్రీడాకారుడు. క్రికెట్ అంటే ఆయనకు ప్రాణం. 40 యేళ్ళ జీవితంలో 30 యేళ్ళ నుండి క్రికెట్ ఆడుతున్న వ్యక్తి. పిన్న వయసులోనే జాతీయ జట్టులో స్ధానం సంపాదించి అద్భుతమైన టెక్నిక్ తో చేయి తిరిగిన బౌలర్లకు కూడా కొరకరాని కొయ్యగా మారిన బ్యాట్స్ మేన్. క్రికెట్ జీనియస్ గా భావించే డాన్ బ్రాడ్ మన్ చేత కూడా ప్రశంసలు అందుకున్న వ్యక్తి. అన్నింటికన్నా మిన్నగా అనేక క్రికెట్ రికార్డులు ఆయన సొంతం. అత్యధిక…

భారత రత్న: విజ్ఞప్తుల/డిమాండ్ల వరద -కార్టూన్

ఆరేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఈసారి ఒకేసారి ఇద్దరికీ ఈ గౌరవం ప్రకటించింది. శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావు కి భారత రత్న ప్రకటించడాన్ని అందరూ ఆహ్వానిస్తుండగా సచిన్ టెండుల్కర్ కి ఇవ్వడమే వివాదాస్పదం అయింది. మరోవైపు భారత రత్న ఫలానా వ్యక్తికి ఎందుకు ఇవ్వరంటూ విజ్ఞప్తులు, అదిలింపులు, బెదిరింపులు వరద కట్టడం విశేషం. సచిన్ కు భారత రత్న ఇవ్వడానికి ముదట వ్యతిరేకించింది హోమ్ మంత్రిత్వ శాఖే. అవును, ఇది నిజం.…

రాజకీయ నాయకులు ఇడియట్స్ -కత్తిరింపు

భారత రత్న అవార్డు పొందిన రసాయన శాస్త్రవేత్త ‘చింతామణి నాగేశ రామచంద్ర రావు (సి.ఎన్.ఆర్.రావు) తనకు అవార్డు ఇచ్చారన్న మొహమాటం కూడా లేకుండా రాజకీయనాయకుల గుణగణాలను ఒక్క మాటతో కడిగిపారేశారు. దేశంలో సైన్స్ అభివృద్ధికి ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న చేదు నిజాన్ని సి.ఎన్.ఆర్ రావు విప్పి చెప్పారు. అసలు విద్యారంగం అంటేనే రాజకీయ నాయకులకు శ్రద్ధ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాన్ని కూడా సి.ఎన్.ఆర్ రావు వదల్లేదు. కాస్త డబ్బులు ఎక్కువ…