ఆర్ధిక వ్యవస్ధకు యుగాంతం ప్రమాదం! -ఎకనమిక్ సర్వే హెచ్చరిక

భారత ప్రభుత్వం 2018-19 కి గాను ఎకనమిక్ సర్వేను విడుదల చేసింది. ఏటా బడ్జెట్ ప్రకటనకు ముందు విడుదలయ్యే ఎకనమిక్ సర్వే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి (జి‌డి‌పి గ్రోత్ కి) నాలుగు పెద్ద గండాలు ఉన్నాయని హెచ్చరించింది. భారత దేశానికి ప్రధాన ఆర్ధిక సలహాదారు (చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్) అరవింద్ సుబ్రమణియన్ రచించిన ఎకనమిక్ సర్వే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పుకుంటున్న ఆర్ధిక గొప్పలను పరిహాసం చేసినంత పని…

మే నెలలో 111 శాతం పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) 111 శాతం పెరిగాయని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఒక్క మే నెలలోనే ఎఫ్.డి.ఐ లు 4.66 బిలియన్ డాలర్లు దేశంలోకి వచ్చాయని ప్రభుత్వం సంబరంగా ప్రకటించింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో వచ్చిన 2.21 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ లతో పోలిస్తే 111 శాతం అధికమని ప్రభుత్వం తెలిపింది. అంతే కాక గత 11 సంవత్సరాల్లో రెండవ అతి పెద్ద మొత్తం…