అణ్వస్త్రాలు: బి.జె.పిది నో-ఫస్ట్-యూజ్ సిద్ధాంతం కాదా?

రేపు సాధారణ ఎన్నికలు ప్రారంభం అవుతాయనగా బి.జె.పి ఈ రోజు తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి మోడి ప్రచారాస్త్రాలకు, మేనిఫెస్టో రచయితల అభిప్రాయాలకు వైరుధ్యం తలెత్తడం వల్లనే మేనిఫెస్టో విడుదల ఆలస్యం అయిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అభివృద్ధి, ఉద్యోగాలు అంటూ మోడి ప్రచారం చేస్తుండగా సంఘ్ పరివార్ పెట్టీ డిమాండ్లయిన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, రాముడి గుడి నిర్మాణం, యూనిఫాం సివిల్ కోడ్ లాంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచడంతో…

కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీ ఆదర్శంగా నిలుస్తుంది -జర్మనీ ఛాన్సలర్

భవిష్యత్తులో కాలుష్యంలేని విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందనీ, తద్వారా విద్యుత్ పరికరాల వ్యాపారంలో జర్మనీ లాభపడుతుందనీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆశాభావం వ్యక్తం చేసింది. 2022 సంవత్సరానికల్లా అణు విద్యుత్ వినియోగానికి స్వస్తి పలకాలని జర్మనీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అణు రియాక్టర్ల మూసివేత ద్వారా ఇతర విద్యుత్ ఉత్పత్తి మార్గాలను ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నాలు జర్మనీని రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో అగ్రస్ధానంలో నిలుపుతాయనీ, తద్వారా జర్మనీ ఆర్ధికంగా లాభపడుతుందనీ ఆమె…

అణు విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా నిషేధించటానికి జర్మనీ నిర్ణయం

అణు విద్యుత్ కర్మాగారాలకు సంబంధించి జర్మనీ ప్రభుత్వం సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. 2022 కల్లా అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న అణు కర్మాగారాలను దశలవారిగా మూసి వేస్తూ, 2022కల్లా అణు విద్యుత్ అనేదే దేశంలో లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. జపాన్‌లో మార్చిలో సంభవించిన భూకంపం, సునామీల వలన 30,000 మంది చనిపోవడమో, ఆచూకీ గల్లంతవడమో జరిగింది. దాంతో పాటు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం భూకంపం, సునామీల ధాటికి బాగా…

ఇరాన్ అధ్యక్షుడి సందర్శన వార్త అమెరికాకి ముందుగా తెలిపిన భారత అధికారులు -వికీలీక్స్

ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 3

ఇరాన్ విషయంలో ఇండియా అమెరికాకి అనుకూలంగా ఓటు వేయడం సరైందా, కాదా, అన్న అనుమానాల భారత సీనియర్ అధికారులను వెంటాడిన విషయం డిసెంబరు 15, 2005 నాటి కేబుల్ బయటపెట్టింది. విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న కె.సి.సింగ్ వ్యాఖ్యలు కేబుల్ లో ఉదరించబడ్డాయి. ఈయన సెప్టెంబరు 2005లో ఇండియా తరపున ఇరాన్ లో రాయబారిగా ఉన్నాడు. అమెరికా భావించినట్టుగా ఇరాన్ పై ప్రభావం పడేయడానికి ఇండియాకు ఇక ఏ మాత్రం అనుకూలత లేదని కె.సి.సింగ్…