భారత చానెళ్ల ప్రసారాలపై పాక్ నిషేధం

మన పత్రికలు చెప్పవు గానీ మన పాలకులు ఇక్కడ ఎంత చేస్తున్నారో, పాక్ పాలకులు అక్కడ అంతా చేస్తున్నారు. మన వాళ్ళు హిస్టీరియా రెచ్చగొడుతున్నట్లే వాళ్ళూ రెచ్చగొడుతున్నారు. మన వాళ్ళు గుండెలు బాదుకుంటున్నట్లే వాళ్ళూ బాదుకుంటున్నారు. మన వాళ్ళు విదేశాల్ని దేబిరిస్తున్నట్లే వాళ్ళూ దేబిరిస్తున్నారు. ఇక్కడ పాక్ అన్న వాసన పైనే ఆంక్షలు విధిస్తున్నట్లే అక్కడ ఇండియా అన్న వాస్తన పైన ఆంక్షలు విధిస్తున్నారు. పాకిస్తాన్ మీడియా నియంత్రణ సంస్ధ తాజాగా తన నియంత్రణ సూత్రాల దుమ్ము…