విభేదాల దేశాలకు నాయకత్వం -ద హిందూ..

[Leading the divided nations, ద ఎడిటోరియల్ – అక్టోబర్ 10,2016- కు యధాతధ అనువాదం.] ********* ఆంటోనియో గుతెయర్ ను సెక్రటరీ జనరల్ పదవికి నామినేట్ చేయడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కనబరచిన విశాల ఏకాభిప్రాయం, ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలతో తలపడటంలో మరింత పటిష్టమైన ఐరాస అవతరించే దిశలో శుభప్రదమైన ఆరంభం. గత వారం భద్రతా సమితిలోని 15 సభ్య దేశాలలో 13 -వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలతో…

ప్రశ్న: UNSC శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగం?

వి లక్ష్మి నారాయణ: ఐక్యరాజ్య సమితి బద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇండియాకి ఎందుకు మెంబర్ షిప్ ఇవ్వలేదు, సభ్యత్వం కోసం వేరే సభ్య దేశాలు రికమెండ్ చేయాలా? ఈ టాపిక్ గురించి తెలియ చేయగలరు. ఇంతకుముందు చర్చించి ఉంటె ఆ లింక్ షేర్ చేయండి. సమాధానం: ఈ టాపిక్ ఇంతకు ముందు ప్రత్యేకంగా కవర్ చేయలేదు. అయితే, ఇతర ఆర్టికల్స్ లో భాగంగా కొంత రాశాను. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి…

అమెరికా చర్చలు జరపనున్న తాలిబాన్ ఇక టెర్రరిస్టు సంస్ధ కాదట!?

తాలిబాన్‌తో పోరాటంలో డస్సిపోయిన అమెరికా తాలిబాన్‌తో చర్చలకు సిద్ధమై అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నది. మంచి తాలిబాన్‌తో చర్చలు జరుపుతామంటూ మూడు, నాలుగేళ్ళనుండే ప్రకటనలు చేస్తూ వచ్చిన అమెరికా అధికారులు అందుకోసం ఒక్కో అడుగూ వేస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ చేత “తాలిబాన్ తో అమెరికా చర్చలు జరుపుతున్నదంటూ రెండు రోజుల క్రితం ప్రకటన ఇప్పించింది. సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో తాలిబాన్‌ను ప్రోత్సహించడానికని చెబుతూ ఇప్పుడు ఆంక్షలు, నిషేధాలు విధించడానికి ఐక్యరాజ్యసమితి తాలిబాన్,…

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల తదుపరి టార్గెట్ సిరియా

రెండు నెలల నుండి లిబియాపై బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడి మౌలిక సౌకర్యాల నన్నింటినీ సర్వ నాశనం చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు సిరియాను తమ తదుపరి లక్ష్యంగా ఎన్నుకున్నాయి. సిరియా అధ్యక్షుడు అబ్దుల్ బషర్ ను గద్దె దించేందుకు ఐక్యరాజ్యసమితిలో పావులో కదుపుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు సిరియాపై సమితి చేత తీర్మానం చేయించడానికి ఒత్తిడి పెంచుతున్నాయి. లిబియా విషయంలో కూడా బ్రిటన్, ఫ్రాన్సు లు అక్కడి ప్రభుత్వం తమ ప్రజలపై నిర్బంధం ప్రయోగిస్తున్నదని మొదట…

పైచేయి సాధించిన గడ్డాఫీ, ‘నో-ఫ్లై జోన్’ అమలుకు భద్రతా సమితి ఓటింగ్

లిబియా తిరుగుబాటుదారుల పై గడ్డాఫీ పైచేయి కొనసాగుతోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు లిబియాకు ముఖద్వారంగా చెప్పుకోదగిన ‘అజ్దాబియా’ పట్టణం కోసం ఇరుపక్షాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. పట్టణాన్ని గడ్డాఫీ బలగాలు మూడువైపుల నుండి చుట్టుముట్టాయి. తూర్పు లిబియాలో అతి పెద్ద పట్టణం, లిబియాలో ట్రిపోలి తర్వాత అతి పెద్ద పట్టణం అయిన బెంఘాజీకి అజ్దాబియా 160 కి.మీ దూరంలో ఉంది. రెడ్ క్రాస్ సంస్ధ సిబ్బంది భద్రతా కారణాలను చూపుతూ బుధవారం బెంఘాజీ నుండి…

సిగ్గూ, లజ్జా వదిలేసిన అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మరో సారి నవ్వుల పాలు

  పాపాల పుట్ట అమెరికా తాను సిగ్గూ, లజ్జా ఎప్పుడో వదిలేశానని మరోసారి ఋజువు చేసుకుంది. తాను నిత్యం వల్లించే విలువలూ, సూత్రాలూ తనకు ఏ మాత్రం వర్తించవని ప్రపంచ వేదిక ఐక్యరాజ్యసమితి లోనే విలువల వలువలు ఊడదీసుకుని మరీ చాటి చెప్పుకుంది. తనకు నీతీ, నియమాలు ఒక లెక్క కాదనీ, తనకు ఉపయోగం అనుకుంటే ఎన్నిసార్లు మొఖం మీద ఉమ్మేసినా తుడుచుకు పోగలననీ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. తన హీనపు బతుక్కి వేరే ఎవరూ అద్దం పట్టనవసరం…