జైట్లీ నిజం కక్కేశారు!

పాత నోట్లను రద్దు చేయటానికి కారణంగా ప్రధాన మంత్రి ఏం చెప్పారు? మూడు ముక్కల్లో చెప్పాలంటే: నల్ల డబ్బు,  టెర్రరిజం, దొంగ నోట్లు… వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయటమే డీమానిటైజేషన్ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. “జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మీరు ఈ చర్యకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే త్యాగాన్ని చేయాలి. ఎందుకంటే ఈ చర్య ద్వారా అవినీతి, నల్ల డబ్బు, దొంగ నోట్లు మరియు టెర్రరిజం.. ఈ చెడుగులపై పోరాటం ఎక్కు పెట్టాము” అని ప్రధాన…

కొత్త నోట్లు: ఆరు నెలలు పడుతుంది -ఆర్ధికవేత్తలు

  RBI నోట్ల ముద్రణా సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే పాత నోట్ల స్ధానంలో కొత్త నోట్లను పూర్తి స్ధాయిలో ప్రవేశపెట్టడానికి 6 నెలల కాలం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన సౌమిత్ర చౌదరి చెప్పారు. కాగా ప్రధాని మోడీ నిర్ణయం వల్ల అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ అర శాతం తగ్గిపోతుందని జర్మనీ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ డ్యూష్ బ్యాంక్ AG అంచనా వేసింది.  బ్యాంకుల వద్ద…

విదేశాల్లో నల్లడబ్బు: మూడో స్ధానంలో ఇండియా

భారతీయుల నల్ల డబ్బు తమ వద్ద లేదని స్విట్జర్లాండ్, తదితర నల్ల డబ్బు స్వర్గాలు నమ్మబలుకుతుండగా అందులో నిజం లేదని వాస్తవాలు తెలియజేస్తున్నాయి. రష్యా, చైనాల తర్వాత దేశీయ డబ్బును విదేశాలకు తరలిపోతున్న దేశాలలో ఇండియాయేదే తదుపరి స్ధానం అని ఒక అంతర్జాతీయ సర్వే సంస్ధ నిర్ధారించింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ (జి.ఎఫ్.ఐ) అనే సంస్ధ నల్ల డబ్బు వివరాలను వెల్లడి చేసింది. జి.ఎఫ్.ఐ నివేదిక ప్రకారం ఒక్క 2012 లోనే 94.76 బిలియన్ డాలర్ల డబ్బు…