అమెరికా ఆర్ధిక పరిస్ధితులే బ్లడ్ బాత్ కి కారణం -2

“రష్యాలో వర్షం కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇండియాలో గొడుగు పట్టుకుంటారు” అని గతంలో పరిహాసం ఆడేవాళ్లు. బి‌జే‌పి పార్టీ, దాని అనుబంధ సంఘాల వాళ్ళకు ఈ పరిహాసం అంటే తగని ఇష్టంగా ఉండేది. “భారత స్టాక్ మార్కెట్ల పతనానికి మేము తెచ్చిన ఎల్‌టి‌సి‌జి పన్ను కారణం కాదు, బలహీన గ్లోబల్ (అమెరికా అని చదువుకోవాలి) ఆర్ధిక పరిస్ధితులే అందుకు కారణం” అని ఇప్పుడు బి‌జే‌పి మంత్రి జైట్లీ నిజాలను విడమరిచి చెబుతున్నాడు. అప్పుడు కమ్యూనిస్టులపై చేసిన పరిహాసం…

ప్రపంచ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ –విశ్లేషణ 1

సోమవారం ప్రపంచం లోని వివిధ ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీ మొత్తంలో నష్టపోయాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఈ భారీ పతనాన్ని బ్లడ్ బాత్ గా అభివర్ణిస్తున్నాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీ అయిన డౌ జోన్స్, 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం కాలంలో కూడా ఎరగని విధంగా ఒకే రోజు 1175 పాయింట్లు నష్టపోయింది. కాబట్టి బ్లడ్ బాత్ అనడం కరెక్ట్ అనిపించక మానదు. అంకెల్లో చూసినప్పుడు ఇంత భారీ పతనాన్ని డౌ…