‘గూగుల్,’ ‘స్కైప్’ సర్వీసులను పర్యవేక్షించే అవకాశం మా గూఢచాలకు ఇవ్వాలి -భారత ప్రభుత్వం

‘గూగుల్ ఇంక్,’ ‘స్కైప్ లిమిటెడ్’ లతో పాటు ఇతర ఇంటర్నెట్ సంస్ధలు, వినియోగదారులకు అందించే సేవలను పర్యవేక్షించే అవకాశం దేశ భద్రతా ఏజెన్సీలకు ఉండాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆయా కంపెనీలు తాము అందజేసే సర్వీసుల ద్వారా మార్పిడి చేసే సమాచారాన్ని ముందుగానే చదివే అవకాశం భారత దేశ భధ్రతా బలగాలు, గూఢచార సంస్ధలకు ఉండాలనీ, భారత దేశ భద్రత రీత్యా అది అవసరమనీ సంబంధిత కేంద్ర మంత్రి బుధవారం, పరిశ్రమల సమావేశాల సందర్భంగా కోరాడు.…