అమెరికా ప్రబల శత్రువు రష్యాయే -సిఐఎ

రష్యా పైన మరో అత్యున్నత అమెరికా అధికారి వ్యసనం వెళ్లగక్కాడు. అమెరికాకు అన్ని విధాలుగా సవాలుగా పరిణమించిన దేశం ఒక్క రష్యా మాత్రమే అని సెంట్రల్ ఇంటలిజెన్స్ ఎజన్సీ డైరెక్టర్ బ్రెన్నన్ వ్యాఖ్యానించాడు. ఏ రంగంలో తీసుకున్నా రష్యా దేశం ఈ రోజు గట్టి స్దానంలో నిలవడానికి ముఖ్య కారణం ఆ దేశ అధ్యక్షుడు పుటిన్ అని బ్రెన్నన్ తన అక్కసు వెళ్లబోసుకున్నాడు. సిబిసి వార్తా సంస్దకు ఇంఠర్వ్యూ ఇస్తూ బ్రెన్నన్ ఈ వ్యాఖ్యలు చేసాడు. “అన్ని…