రౌసెఫ్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

(బ్రెజిల్ వర్కర్స్ పార్టీ నేత దిల్మా రౌసెఫ్ రెండో సారి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. అనేక అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన నేపధ్యంలో ఆమెకు ప్రత్యర్ధుల నుండి గట్టి సవాలు ఎదురయింది. అయినప్పటికీ రనాఫ్ ఎన్నికల్లో కొద్ది తేడాతో గట్టెక్కారు. మొదటిసారి జరిగే ఎన్నికల్లో ఎవరికీ సాధారణ మెజారిటీ రాకపోతే, ముందు నిలిచిన ఇద్దరు అభ్యర్ధుల మధ్య రెండో సారి తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఇలా రెండో సారి జరిగే ఎన్నికలను రనాఫ్ ఎన్నికలు అంటారు. బ్రెజిల్ ఎన్నికల ఫలితంపై…