ఫ్రాన్స్-బ్రిటన్ మధ్య తీవ్రమైన చేపల తగాదా: ఆకస్ పుణ్యం?

ఆస్ట్రేలియా, యూ‌కే, అమెరికాలు కలిసి ఇండో-పసిఫిక్ ప్రాంతం లక్ష్యంగా ‘ఆకస్’ కూటమి ఏర్పడిన నేపధ్యంలో ఫ్రెంచ్, బ్రిటిష్ దేశాల మధ్య చేపల వేట తగాదా మరింత తీవ్రం అయింది. డిసెంబర్ 31, 2020 నాటితో బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయినప్పటి నుండి అడపా దడపా ఇరు దేశాల ఫిషింగ్ బోట్లు చేపల వేట హక్కుల విషయమై తగాదా పడుతూ వచ్చాయి. నేడు ఆ తగాదా ఫ్రెంచి ప్రభుత్వమే ప్రత్యక్ష చర్య తీసుకునే వరకూ వెళ్లింది. ఆకస్ ఏర్పాటు ఫలితంగా…

బ్రెగ్జిట్ పై బ్యాంక్సీ టేక్ -వీధి చిత్రాలు

లండన్ కు చెందిన వీధి చిత్రాల కళాకారుడు బ్రెగ్జిట్ పై తన కళాలోచనను తాజా వీధి చిత్రం ద్వారా పంచుకున్నాడు. తన వీధి చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాపితంగా అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ తానెవరో ప్రపంచానికి తెలియనివ్వని బ్యాంక్సీ ఎక్కడ గోడపై ఒక గీత గీసిన సంచలనమే. పశ్చిమ సామాజిక, సాంస్కృతిక విలువలపై విమర్శలతో ప్రారంభించి రాజకీయ విమర్శల వరకూ ప్రయాణించిన బ్యాంక్సీ వీధి చిత్రాలు సామాన్య ప్రజలకు కన్నుల పండుగ, అనామ్దాదాయకం కాగా ధనిక…

బ్రెగ్జిట్: ఎగువ సభలో ధెరెసా పాక్షిక ఓటమి -విశ్లేషణ

బ్రిటిష్ ప్రధాని ధెరెసా ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్) లో పాక్షిక ఓటమిని ఎదుర్కొన్నారు. ప్రధాని ప్రతిపాదించిన బ్రెగ్జిట్ బిల్లు దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) లో యధాతధంగా ఆమోదం పొందగా ఎగువ సభలో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన సవరణతో ఆమోదం పొందింది. బ్రెగ్జిట్ తీర్పు అమలు చేసే విషయంలో ఆమె రచించిన పధకానికి ఈ ఓటమి వల్ల ఆటంకాలు ఎదురుకానున్నాయి. బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభం ఆలస్యం కావచ్చు. లార్డ్స్ సభలో బ్రెగ్జిట్…

బ్రెగ్జిట్ చర్చలు 2017 మార్చిలో మొదలు -ప్రధాని

బ్రిటిష్ ప్రజల తీర్పు ‘బ్రెగ్జిట్’ ను అమలు చేసే ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం అవుతుందని బ్రిటిష్ ప్రధాని ధెరెసా మే ప్రకటించారు. కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ ను ప్రారంభిస్తూ ధెరెసా చేసిన ప్రకటన బ్రెగ్జిట్ విషయమై కాస్త స్పష్టత ఇచ్చిందని యూరోపియన్ యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా బ్రిటన్ లోని బ్రెగ్జిట్ వ్యతిరేకులు సణుగుడు కొనసాగించారు. బ్రెగ్జిట్ ఓటింగ్ ముందు వరకు ‘రిమైన్’ (ఈ‌యూ లో కొనసాగాలి) శిబిరంలో ఉన్న…

బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు (ఎటు వైపు?) -ద హిందూ ఎడిట్…

– [ఈ రోజు ద హిందూ ‘The road from Bratislava’ శీర్షికన  ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతథ అనువాదం] ఒకటి తక్కువ 28 ఈయూ దేశాలు బ్రెగ్జిట్ అనంతర ప్రపంచం గురించి చర్చించడానికి సమావేశమైన బ్రటిస్లావా భవంతిలో ఐక్యత, పొందికల లేమి సుస్పష్టంగా వ్యక్తం అయింది. ఏ ఒక్కరూ ఎలాంటి భ్రమలకూ తావు ఇవ్వటం లేదు. ఈయూ ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్…

బ్రెగ్జిట్ వ్యతిరేకి చేతుల్లో బ్రెగ్జిట్!

యూకె లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈయూ నుంచి విడాకులు తీసుకునే కార్యక్రమం బ్రెగ్జిట్ అనుకూల రాజకీయ నాయకుల చేతుల మీదుగా జరగవలసి ఉండగా అది కాస్తా ఇప్పుడు బ్రెగ్జిట్ వ్యతిరేకుల చేతుల మీదుగా జరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి పరిస్ధితి ఏర్పడటం కాదు, అదే జరగబోతోంది కూడా. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన ప్రచారానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ…

త్వరగా దయచేయండి! -ఈయు

‘బైటకు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు గదా, ఇంకా ఎన్నాళ్ళు చూరు పట్టుకుని వెళ్ళాడుతారు?’ అని బ్రిటన్ / యూకె ను నిలదీసి ప్రశ్నిస్తోంది యూరోపియన్ యూనియన్. కొందరు ఈయు నేతల ప్రకటనలు చూస్తే బ్రిటన్ నేతల నాన్చుడు ధోరణి వారికి ఎంత మాత్రం ఇష్టంగా లేదని స్పష్టం అవుతోంది. “యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వెళ్ళే కార్యక్రమాన్ని బ్రిటన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి” అని ఈయు కమిషనర్ ఒకరు హెచ్చరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.…

బ్రెగ్జిట్ తర్వాత… -కార్టూన్ లలో

అందరిలాగే కార్టూనిస్టులూ బ్రెగ్జిట్ కు స్పందించారు. వారి వారి ప్రయోజనాలకు తగినట్లుగానే ఆయా పత్రికలు, కార్టూనిస్టులు స్పందించారు. బహుళజాతి కంపెనీల పోషణలోని పశ్చిమ పత్రికలు బ్రెగ్జిట్ ఓటును దూషిస్తూనో, ఎకసక్కెం చేస్తూనో కార్టూన్ లు ప్రచురించగా బ్రెగ్జిట్ సానుకూలుర స్పందన కాస్త వాస్తవాలకు దగ్గరగా తమ గీతల్లో స్పందించారు. ఈ రెండో రకం కార్టూన్ లు వ్యక్తిగతంగా ట్విట్టర్ ద్వారా మాత్రమే పబ్లిష్ చేసుకునే అవకాశం లభించింది. మొదటి రకం కార్టూన్ లకు ప్రధాన స్రవంతి పత్రికలలో…

పుట్టిన ఊర్ల యూరప్ కోసం…!

[బల్గేరియా పత్రిక “A-specto” లో బల్గేరియా రచయిత ఏంజెల్ జంబాజ్కి చేసిన రచన ఇది. బల్గేరియన్ భాషలో చేసిన రచనను వలెంతినా జోనేవా ఆంగ్లంలోకి అనువదించగా సౌత్ ఫ్రంట్ ప్రచురించింది. దానిని తెలుగులోకి మార్చి ఇక్కడ ప్రచురిస్తున్నాను. యూరోపియన్ యూనియన్ ను సభ్య దేశాలపై ముఖ్యంగా సభ్య దేశాల శ్రామిక ప్రజలపై, వారి సంస్కృతిపై, వారి జీవనంపై, వారి కుటుంబాలపై ఏ విధంగా రుద్దారో ఈ రచన తెలియజేస్తుంది. -విశేఖర్] ********* సందేహం లేదు, ఇది చరిత్రాత్మకమే.…

బ్రెగ్జిట్ అద్భుతం: ఈ‌యూతో విడాకులకే బ్రిటిష్ ఓటు (విశ్లేషణ)

బ్రిటన్ ప్రజలు అనూహ్య ఫలితాన్ని ప్రపంచం ముందు ఉంచారు. యూరోపియన్ యూనియన్ తో విడిపోవటానికే మా ఓటు అని చాటి చెప్పారు. జూన్ 23 తేదీన గురువారం జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్ కే ఓటు వేశారు. 51.9 శాతం మంది బ్రెగ్జిట్ (లీవ్ ఈ‌యూ) కు ఓటు వేయగా 48.1 శాతం మంది ఈ‌యూలో కొనసాగాలని (రిమైన్) ఓటు వేశారు. 3.8 శాతం మెజారిటీతో బ్రెగ్జిట్ పక్షాన నిలిచారు. తద్వారా దశాబ్దాలుగా అమెరికా తమపై…

బ్రెగ్జిట్ -కార్టూన్ లలో…

ఒక అంశాన్ని కార్టూన్ ల కంటే శక్తివంతంగా వివరించేవి మరొకటి ఉండవేమో. రేపు బ్రెగ్జిట్ రిఫరెండం జరగనున్న నేపధ్యంలో ఇంటర్నెట్ నుండి సేకరించిన కొన్ని కార్టూన్ లు చూడటం వల్ల రేపు జరిగే పరిణామాన్ని ‘అటైనా/ఇటైనా’ అర్ధం చేసుకునే అవకాశం లభిస్తుంది. కింది కార్టూన్ లలో 10వ (మూడో వరసలో రెండవది) వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉండటం గమనించవచ్చు.

రేపే బ్రెగ్జిట్ రిఫరెండం!

ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు మలుపు, కుదుపు కాగల మార్పులకు దారి తీసే అవకాశం ఉన్న ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ఉరఫ్ రిఫరెండం రేపు, జూన్ 23 తేదీన, బ్రిటన్ లో జరగనున్నది. “యూ‌కే, యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా లేక బైటికి రావాలా?” అన్న ఏక వాక్య తీర్మానంపై జరిగనున్న రిఫరెండంలో విజేతగా నిలవటానికి ఇరు పక్షాలు సర్వ శక్తులూ ఒడ్డాయి. గెలుపు ఇరువురు మధ్యా దొబూచులాడుతోందని సర్వేలు చెప్పడంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. యూ‌కే రిఫరెండంలో యూ‌కే…

బ్రెగ్జిట్ కు పెరుగుతున్న ఆదరణ!

బ్రిటన్ + ఎగ్జిట్ = బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెక్సిట్ అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుండి మరిన్ని రాయితీలు పొందే లక్ష్యంతో బ్రిటన్ ప్రధాని కామెరాన్ నిర్వహిస్తున్న రిఫరెండం కాస్తా నిజంగానే ఈ‌యూ ఎగ్జిట్ వైపుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఒపీనియన్ పోల్స్ అన్నింటి లోనూ ‘ఇన్’ (ఈ‌యూలోనే కొనసాగుదాం) శిబిరానికే అధిక ఆదరణ ఉన్నట్లు చెబుతూ వచ్చాయి. కానీ సోమవారం జరిగిన ఒక పోలింగు లో మొట్ట…