బ్రిటిష్ పార్లమెంటులో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం

బ్రెగ్జిట్ బిల్లును ఎట్టకేలకు బ్రిటన్ దిగువ సభ ఆమోదించింది. ‘కామన్స్’ గా పిలిచే బ్రిటన్ దిగువ సభ అత్యధిక మెజారిటీతో బిల్లును ఆమోదించడం విశేషం. బిల్లు ప్రారంభ దశలో 114 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయగా, చర్చల అనంతరం అంతిమ ఓటింగ్ లో వ్యతిరేకులు 122 కు పెరిగారు.  బ్రెగ్జిట్ బిల్లును అధికారికంగా ‘యూరోపియన్ యూనియన్ (నోటిఫికేషన్ ఆఫ్ విత్ డ్రాల్) బిల్’ గా పిలుస్తున్నారు. 650 మంది సభ్యులు ఉన్న ‘హౌస్ ఆఫ్…