పాలస్తీనాకు బ్రిటిష్ పార్లమెంటు గుర్తింపు

పాలస్తీనా ప్రజల స్వతంత్ర పోరాటంలో ఒక చిన్న మలుపు లాంటి పరిణామం చోటు చేసుకుంది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ కామన్స్ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ చర్యను మలుపుగా నిర్ధారించలేము గానీ సంకేతాత్మక మలుపు అనవచ్చు. ఒక దేశం ఇచ్చిన గుర్తింపుతో ప్రోత్సాహం పొంది ఇతర దేశాలు కూడా ఇలాంటి సంకేతాత్మక గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవచ్చు. పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాలు సమాంతరంగా ఉనికిలోకి రావడమే పరిష్కారం అని మెజారిటీ పక్షాలు భావిస్తున్నాయి.…