జులియన్ అసాంజేని అమెరికికాకు ఇచ్చేస్తారట! -కార్టూన్

బ్రిటన్ హై కోర్టు అసాంజే ను అమెరికాకు extradite చెయ్యడానికి ఓకే చెబుతూ తీర్పు చెప్పింది. దానితో అయన హక్కులకు చివరికి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చింది. అసాంజేను లాక్కెళ్లి జైల్లో కుక్కడానికి, ఆయనను చిత్ర హింసలు పెట్టి కక్ష తీర్చుకోవడానికి అమెరికా అనేక ఏళ్లుగా ఉవ్విళ్లూరుతోంది. బ్రిటన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తూ వచ్చింది. అమెరికా ఒత్తిళ్లు ఫలించాయి. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే అంకుల్ సామ్ ఏం చేస్తాడో కార్టూన్ చెబుతోంది. డిప్లొమాటిక్ కేబుల్స్ తో…

బ్రిటన్ పై ఇండియా ప్రతీకార చర్య

భారత దేశం బదులు తీర్చుకుంది. యూ‌కే నుండి వచ్చే యూ‌కే పౌరులు ఇండియాకు వస్తే గనక వారు తప్పనిసరిగా 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ లో ఉండే విధంగా నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు అక్టోబర్ 4 తేదీ నుండి అమలులోకి రానున్నాయి. బ్రిటన్ పౌరులు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా, దేశంలోకి వచ్చిన తోడనే తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్ లో ఉండడంతో పాటు మొదట ఆర్‌టి-పి‌సి‌ఆర్ పరీక్ష చేయించుకోవాలని ఇండియా నిర్దేశించింది. అలాగే వచ్చిన…

ఆకస్: సుదృఢం అవుతున్న బహుళ ధృవ ప్రపంచం! -3

    నాటోకు కాల దోషం? అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైనిక ఉపసంహరణ విషయమై నాటో కూటమి లోని ఈ‌యూ సభ్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాటో కూటమితో సంప్రదించకుండా, ఈ‌యూతో ఏకీభావం సాధించకుండా ఆఫ్ఘన్ నుండి సైనిక బలగాలను ఆగస్టు 31 లోపు ఉపసంహరిస్తున్నామని బైడెన్ ఏకపక్షంగా ప్రకటించడం ఈ‌యూ దేశాలకు గాని నాటో కూటమికి గానీ మింగుడు పడలేదు. అత్యంత పెద్దదయిన నాటో ‘ఉమ్మడి’ మిలట్రీ స్ధావరం అయిన బాగ్రం వైమానికి స్ధావరాన్ని జులైలో ఖాళీ…

ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని చేరువ చేసిన ‘ఆకస్’ మిలట్రీ కూటమి

  2021 సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ భౌగోళిక-రాజకీయ యవనికపై ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా(A), బ్రిటన్ (యునైటెడ్ కింగ్^డమ్ – UK), అమెరికా సంయుక్త రాష్ట్రాలు (US).. ఈ మూడు సభ్య దేశాలుగా ‘ఆకస్ (AUKUS) పేరుతో మిలట్రీ కూటమి ఏర్పడినట్లుగా మూడు దేశాల నేతలు ప్రకటించారు. కూటమి ఏర్పాటు దానికదే ఒక ముఖ్య పరిణామం కాగా, ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే 8 సబ్ మెరైన్లను అమెరికా సరఫరా చేయనున్నట్లు…

బ్రెగ్జిట్ కు పెరుగుతున్న ఆదరణ!

బ్రిటన్ + ఎగ్జిట్ = బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెక్సిట్ అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుండి మరిన్ని రాయితీలు పొందే లక్ష్యంతో బ్రిటన్ ప్రధాని కామెరాన్ నిర్వహిస్తున్న రిఫరెండం కాస్తా నిజంగానే ఈ‌యూ ఎగ్జిట్ వైపుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఒపీనియన్ పోల్స్ అన్నింటి లోనూ ‘ఇన్’ (ఈ‌యూలోనే కొనసాగుదాం) శిబిరానికే అధిక ఆదరణ ఉన్నట్లు చెబుతూ వచ్చాయి. కానీ సోమవారం జరిగిన ఒక పోలింగు లో మొట్ట…

ఆసాంజే నిర్బంధం నిరంకుశం -ఐరాస

వికీలీక్స్ వ్యవస్ధాపక ఎడిటర్ జులియన్ ఆసాంజే నిర్బంధం చట్ట విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఆసాంజే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఐరాస కమిటీ ఈ మేరకు ఒక నిర్ధారణ వచ్చిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే కమిటీ నిర్ణయాన్ని అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తారని పత్రిక తెలిపింది. స్వీడన్ లో దాఖలయిన ఒక తప్పుడు కేసు దరిమిలా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో గత నాలుగు సంవత్సరాలుగా లండన్ పోలీసు నిర్బంధంలో ఆసాంజే గడుపుతున్నాడు. ఆసాంజేను…

ప్రధాన స్రవంతి పార్టీలకు సవాలు -ది హిందూ ఎడిట్

  (ఐరోపా దేశాల్లో మితవాద శక్తుల ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ శక్తులు వలస ప్రజలకు వ్యతిరేకంగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కు కూడా వీరు వ్యతిరేకం. ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు తీవ్రం అయ్యేకొద్దీ వాటినుండి బైటపడేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనలు తిరుగుబాటు భావజాలం వైపుకి మరలకుండా ఉండేందుకు ప్రస్తుత పాలక వర్గాల పార్టీలు తామే ఒక తీవ్రవాద ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తెస్తారు. ప్రజలు తమలో తాము ఘర్షణ…

ఇరాక్, సిరియాల్లో 900 మంది ఫ్రెంచి జిహాదీలు

మధ్య ప్రాచ్యంను కుదిపేస్తున్న ఇస్లామిక్ ఘర్షణల్లో పశ్చిమ దేశాల పౌరులు పాల్గొనడం నానాటికీ పెరుగుతోంది. సిరియాలో పశ్చిమ దేశాలు ప్రేరేపించిన కిరాయి తిరుగుబాటు మొదలైనప్పటి నుండి అనేక ఇస్లామిక్ దేశాల నుండి ఆకర్షించబడిన అమాయక యువత సిరియాకు ప్రయాణం కట్టారు. సో కాల్డ్ జిహాద్ లో పాల్గొనడానికి పశ్చిమ దేశాల నుండి కూడా ముస్లిం యువత ఇరాక్, సిరియాలకు వెళ్ళడం పెరిగిపోయిందని ఆ దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. ‘ఇస్లామిక్ స్టేట్’ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్…

దశాబ్దాల భారతీయ శ్రమ కుప్పపోస్తే, లండన్! -ఫోటోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా బ్రిటన్ కి పేరు. మొట్ట మొదటి పౌర హక్కుల పత్రం ‘మాగ్న కార్టా’ కు ప్రాణం పోసింది బ్రిటిష్ పెట్టుబడిదారులే. రాచరికం నుండి హక్కుల కోసం పోరాడిన బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గం అనతికాలంలోనే ప్రపంచం లోని అనేక ఖండాంతర దేశాలకు బయలెల్లి అక్కడి ప్రజలకు హక్కులు లేకుండా చేశారు. బ్రిటిష్ వలస పాలకులు భారత దేశం లాంటి సంపన్న వనరులున్న దేశాలను దురాక్రమించి వలసలుగా మార్చుకుని ఒకటిన్నర శతాబ్దాల పాటు అక్కడి…

బ్రిటిష్ మాజీ ప్రధాని ధాచర్ మరణం వారికి పండగ -ఫోటోలు

బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ ధాచర్ ఏప్రిల్ 8 తేదీన మరణించింది. ఆమె మరణం పట్ల ధనికులు ఖేదం ప్రకటిస్తే కార్మికులు, అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలు అనేకులు మోదం ప్రకటించారు. దేశవ్యాపిత సంబరాలకు సైతం ‘క్లాస్ వార్’ లాంటి సంస్ధలు, మైనింగ్ వర్కర్స్ యూనియన్ లాంటి కార్మిక సంఘాలు పిలుపునిచ్చి అమలు చేసాయి కూడా. ధాచర్ మరణం పట్ల సంబరాలు జరుపుకున్న ఫోటోలను కింద చూడవచ్చు. ఈ సంబరాలకు కారణం ఏమిటో అర్ధం చేసుకోవాలంటే చరిత్రలోకి కొద్దిగా…

ఆసాంజే అరెస్టుకి బ్రిటన్ రహస్య పధకం

ఈక్వడార్ రాయబార కార్యాలయంలో శరణు పొందిన జూలియన్ ఆసాంజే ని ఏ పరిస్ధితిలోనైనా అరెస్టు చెయ్యాల్సిందేనని లండన్ పోలీసులకు వచ్చిన రహస్య ఆదేశాలు బట్టబయలయ్యాయి. పోలీసు అధికారి చేతిలో ఉన్న ఆదేశ పత్రాలలోని అక్షరాలు విలేఖరుల కంటికి చిక్కడంతో రహస్య పధకం వెల్లడయింది. ఈక్వడార్ ‘రాజకీయ ఆశ్రయం’ లో రక్షణ పొందుతున్నప్పటికీ ఎట్టి పరిస్ధితుల్లోనూ జూలియన్ ఆసాంజే ను అరెస్టు చెయ్యడానికి బ్రిటన్ నిశ్చయించిందని తెలిసి వచ్చింది. వివిధ దేశాల మధ్య రాయబార సంబంధాల విషయమై కుదిరిన…

ఆకలి, దరిద్రాలతో బడి మానేస్తున్న బ్రిటన్ విద్యార్ధులు

బడిమానేయడం ఇండియాలో సర్వ సాధారణం. పిల్లల్ని కూలికి పంపితే కుటుంబానికి కొంచెం ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో పల్లేల్లొ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు చేతికందాక బడిమానిపిస్తారు. మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల పుణ్యమాని ఇప్పుడు యూరప్ లోని ధనిక దేశాల్లో సైతం ఆ పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత స్తంభించిపోయిన ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్ధరించి వేగవంతం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ప్రవేటు బహుళజాతి…

ప్రైవేటు బ్యాంకుల నష్టాన్ని చెల్లించడానికి దృఢంగా నిరాకరిస్తున్న ఐస్ లాండ్ ప్రజలు

2008 సం. నాటి ద్రవ్య సంక్షోభంలో కుప్పకూలిన ఐస్ లాండ్ ప్రవేటు బ్యాంకుల నష్టాన్ని చెల్లించడానికి ఐస్ లాండ్ ప్రజలు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. గత సంవత్సరం మార్చిలో జరిగిన రిఫరెండంలో 93 శాతం ప్రజలు ఐస్ లాండ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరస్కరించగా ఏప్రిల్ 9, 2011 తేదీన జరిగిన మరో పాక్షిక రెఫరెండంలో సైతం 58 శాతం మంది ప్రవేటు బ్యాంకుల నష్టాన్ని భరించడానికి తిరస్కరించారు. ప్రభుత్వం కుదుర్చుకున్న “ఐస్ సేవ్” ఒప్పందం ప్రకారం ఐస్…