మరోసారి క్షీణించిన జి.డి.పి, తీవ్ర రిసెషన్ లో బ్రిటన్

వరుసగా మూడో క్వార్టర్ లో కూడా బ్రిటన్ స్ధూల దేశీయోత్పత్తి (జి.డి.పి) పడిపోయింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో ప్రారంభం అయిన బ్రిటన్ జి.డి.పి పతనం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో కూడా కొనసాగడంతో బ్రిటన్ అధికారికంగా రిసెషన్ (మాంద్యం) లోకి జారుకున్నట్లయింది. ఈ పతనం వరుసగా ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో కొనసాగి మునుపటి కంటే ఎక్కువగా నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదు…

2012 లో కుదేలు కానున్న బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ

వచ్చే సంవత్సరం బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర స్ధాయిలో కుచించుకుపోతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి చాలా తక్కువగా ఉంటుందని ఈ బ్యాంకు గతంలోనే జోస్యం చెప్పింది. గతంలో అంచనా వేసినట్లుగా వృద్ధి చెందడానికి బదులు బ్రిటన్ ఎకానమీ కుచించుకుపోతుందని బ్యాంకు ఇప్పుడు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఎకానమీ 0.6 శాతం వృద్ధి చెందుతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ అంచనా వేసింది. దానికి బదులు 1.3 శాతం మేరకు కుచించుకుపోతుందని (లేదా…

పొదుపు విధానాలతో బాగా పడిపోయిన బ్రిటన్ల ఆదాయాలు

బడా బహుళజాతి కంపెనీలను సంక్షోభం నుండి బైటపడేయానికి ఇచ్చిన బెయిలౌట్ల కోసం అప్పులు తెచ్చిన పశ్చిమ దేశాల ప్రభుత్వాలు సదరు అప్పులు తీర్చడానికి ప్రజలపైనే భారం మోపుతూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల వల్ల బ్రిటన్ లో కార్మికులు, ఉద్యోగుల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయని ప్రభుత్వ సంస్ధ ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ (ఒ.ఎన్.ఎస్) చేసిన సర్వేలో తేలింది. అదే సమయంలో సీనియర్ మేనేజర్ల వేతనాలు మాత్రం అనేక రెట్లు…